Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ నిజంగా భోళా శంకరుడే... ఒక్కరోజు భోజనాల ఖర్చు అన్ని కోట్లా!

ప్రభాస్ మరోసారి తన భోళా గుణం నిరూపించుకున్నాడు. అభిమానులకు పసందైన విందు ఏర్పాటు చేసి తన ప్రత్యేకత చాటుకున్నాడు. మొగల్తూరులో ప్రభాస్ ఏర్పాటు చేసిన భోజనాల ఖర్చు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది.

prabhas spends crores for menu in krishnamraju memorial meet
Author
First Published Oct 1, 2022, 2:32 PM IST


ప్రభాస్ ఆహార ప్రియుడు. ఇండియన్, వెస్ట్రన్ అనే తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని రకాల అరుదైన వంటకాలను రుచి చూడాలి అనుకుంటారు. తాను తినడమే కాకుండా తన పక్కన ఉన్నవారితో అవి పంచుకోవాలి అనుకుంటాడు. దీనిలో భాగంగా ప్రభాస్ కి ఒక అలవాటు ఉంది. తనతో జతకట్టే హీరోయిన్ కి ఒక రోజు ఆతిధ్యం ఏర్పాటు చేస్తారు. షూటింగ్ సెట్స్ ని మంచి రెస్టారెంట్ గా మార్చేస్తాడు. రుచికరమైన వంటకాలను స్వయంగా వండించి తీసుకొస్తారు. 

ఆరోజు సదరు హీరోయిన్ తో పాటు సెట్ లో ఉన్నవారందరికీ పండగే. శ్రద్దా కపూర్, శృతి హాసన్, పూజా హెగ్డే, భాగ్యశ్రీతో పాటు పలువురికి ఇప్పటికే ఈ అనుభవమైంది. వారందరు ప్రభాస్ ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పుకున్నారు. అలాంటి ప్రభాస్ ఫ్యాన్స్ విషయంలో తగ్గుతాడా చెప్పండి. పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభ మొగల్తూరులో ప్రభాస్ ఏర్పాటు చేశాడు. సెప్టెంబర్ 29న ప్రభాస్ అక్కడ ఈ కార్యక్రమం జరిపారు. 

ఈ కార్యక్రమం కోసం గతవారం రోజులుగా కసరత్తులు జరిగాయి. ప్రభాస్ 50 మంది సిబ్బందిని మొగల్తూరు ముందుగానే పంపించారు. దాదాపు 75 వేల మందికి భోజనాలు అంచనా వేశారు. హైదరాబాద్ నుండే నిష్ణాతులైన వంటవాళ్లను మొగల్తూరుకి తీసుకెళ్లారు. అన్ని రకాల నాజ్ వెజ్, వెజ్ ఐటమ్స్ తో 50 డిషెస్ వరకు మెనూలో పొందుపరిచారు. మాంసం టన్నుల్లో కొనుగోలు చేశారు. సంస్మరణ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కడుపు నిండా భోజనం చేసి వెళ్లాలని ప్రభాస్ భావించారు. 

అనుకున్న ప్రకారం అభిమానులకు కనీవినీ ఎరుగని విందు భోజనం ఏర్పాటు చేశాడు. కాగా ఈ భోజనాలకు ప్రభాస్ చేసిన ఖర్చు రూ. 3 కోట్ల రూపాయలట. ఒక్కరోజు భోజనాల కోసం కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్ గురించి ఇండస్ట్రీ వర్గాలు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాయి. ఇక ప్రభాస్ 12 ఏళ్ల తర్వాత మొగల్తూరు వెళ్లారు. ఆయన్ని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. మొగల్తూరు జనసంద్రమైంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios