Asianet News TeluguAsianet News Telugu

విజయ్‌ దేవరకొండ సరసన పూజా హెగ్డే ! ఏ సినిమాలో అంటే..

విజయ్ దేవరకొండ ఖుషీ షూటింగ్ అనంతరం ఈ సినిమా షూట్ మొదలెడతారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో పూజ పాత్ర హైలెట్ గా ఉంటుందని అందుకనే వెంటనే వేరే మాట ఆలోచించకుండా సైన్ చేసేసిందని తెలుస్తోంది.  

Pooja Hegde to romance Vijay Deverakonda
Author
First Published Jun 8, 2023, 1:04 PM IST


పూజ హెగ్డేకి వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ, ఆమెకి ఉన్న క్రేజ్ గానీ .. మార్కెట్ గాని కొంచెం కూడా  తగ్గలేదు. ఆమెకు వరస ఆఫర్స్ అయితే  వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయి ఫ్లాపులు పడినప్పటికీ, ఆమె కొంచెం కూడా వెనకడగు వేసే పరిస్దితి లేదు. వచ్చిన అవకాశాల్లో తనకి నచ్చినవాటికి సైన్ చేస్తూ ముందుకు వెళుతోంది . తాజాగా  ‘బుట్టబొమ్మ’ పూజ హెగ్డే విజయ్‌తో జతకట్టనుందని సమాచారం. 

ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా ఆమె నటిస్తోంది. ఇక మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోపరుశరామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందే సినిమా సైన్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం ఆగస్ట్ నుంచి పట్టాలు ఎక్కనుంది. విజయ్ దేవరకొండ ఖుషీ షూటింగ్ అనంతరం ఈ సినిమా షూట్ మొదలెడతారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో పూజ పాత్ర హైలెట్ గా ఉంటుందని అందుకనే వెంటనే వేరే మాట ఆలోచించకుండా సైన్ చేసేసిందని తెలుస్తోంది. అసలు వీళ్లిద్దరు పూరి డైరక్షన్ లో మొదలై ఆగిన జనగణమన చిత్రంలోనే చేయాల్సి ఉంది. 
 
తమిళంలో కూడా ఆమె ఒక భారీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు .. ఆ సినిమాలో హీరో కార్తి. గతంలో కార్తి హీరోగా వచ్చిన 'ఆవారా' తమిళంతో పాటు తెలుగులోను హిట్ టాక్ తెచ్చుకుంది. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి లింగుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఆయన పూజ హెగ్డేను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. కార్తి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం పక్కానే. అంతా అనుకున్నట్టుగా జరిగితే 'బీస్ట్' తరువాత పూజ హెగ్డే చేసే సినిమా ఇదే అవుతుందని చెప్పచ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios