MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • TV
  • 20 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

20 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

హీరోయిన్లు ఒక్క సారి పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత ఫ్యామిలీకే పరిమితం అవుతుంటారు. కొంత మంది మాత్రమే రీ ఎంట్రీలు ఇస్తూ.. సందడి చేస్తుంటారు. దాదాపు 20 ఏళ్ల తరువాత తెరపైకి వచ్చిన ఓహీరోయిన్.. వరుస ఆఫర్లతో అదరగొడుతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 05 2026, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
20 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ?
Image Credit : Asianet News

20 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ?

టాలీవుడ్‌లో హోమ్లీ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ లయ. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె.. రీ ఎంట్రీ ద్వారా మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత ఆమె కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. 

నటుడు శివాజీతో కలిసి ఆమె నటించిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో లయ తన రీఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మొదటిసారి విలన్ పాత్రలో..
Image Credit : laya insta

మొదటిసారి విలన్ పాత్రలో..

ఈ సినిమాలో తాను ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా కనిపించబోతున్నట్లు లయ తెలిపారు. గతంలో ఎక్కువగా హోమ్లీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె, ఈ సినిమాలో మాత్రం ‘ఉత్తర’ అనే స్వార్థపరురాలైన భార్య పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. కథలో ఈ పాత్ర చాలా కీలకమని, భర్త పాత్రలో నటించిన శివాజీని ఇబ్బందులకు గురిచేసే విధంగా కథ ముందుకు సాగుతుందని వివరించారు. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విధంగా ఈ పాత్ర ఉంటుందని ఆమె తెలిపారు.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Related image2
Rashmika-Vijay : ఎర్రటి మైసూర్ సిల్క్ చీర, నెమలి నెక్లెస్‌తో రష్మిక రచ్చ, విజయ్ ఎలా ఉన్నాడంటే?
34
లయకు వరుసగా ఆఫర్లు..
Image Credit : laya insta

లయకు వరుసగా ఆఫర్లు..

సెకండ్ ఇన్నింగ్స్‌లో తాను కేవలం ఎమోషనల్ పాత్రలకే పరిమితం కావాలని భావించడం లేదని లయ స్పష్టం చేశారు. మంచి కథలతో పాటు బలమైన పాత్రలు ఉంటే తప్పకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పాత్ర చిన్నదైనా, కథలో ప్రాధాన్యం ఉంటే ఆ అవకాశం స్వీకరిస్తానని చెప్పారు. 

ప్రస్తుతం లయ మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఒకటి నటుడు జగపతిబాబుతో కలిసి చేస్తున్న ‘వదలా’ అనే సైకలాజికల్ థ్రిల్లర్. అలాగే శ్రీకాంత్‌తో కలిసి ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు.

44
ఈటీవీ విన్ తో పాటు శివాజీ నిర్మించిన సినిమా..
Image Credit : laya insta

ఈటీవీ విన్ తో పాటు శివాజీ నిర్మించిన సినిమా..

ఈటీవీ విన్ తో పాటు శివాజీ సంయుక్తంగా నిర్మించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందిస్తుందని మూవీటీమ్ నమ్మకం వ్యక్తం చేసింది. ఈ సినిమాతో లయ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Recommended image2
Rashmika-Vijay : ఎర్రటి మైసూర్ సిల్క్ చీర, నెమలి నెక్లెస్‌తో రష్మిక రచ్చ, విజయ్ ఎలా ఉన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved