ఆర్ ఆర్ ఆర్ బాక్సాఫీస్ వద్ద ఇప్పట్లో నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. విడుదలైన 9వ రోజు కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టి సత్తా చాటింది.వీకెండ్ తో పాటు పండగ కలిసి రావడంతో రికార్డు వసూళ్లు రాబట్టింది.
రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ దుమ్మురేపుతోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ ఆదరణ దక్కించుకుంటుంది. ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ ల నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదే సమయంలో తమ హీరోల పేరిట భారీ రికార్డ్స్ నమోదవుతుండగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక హిందీ బెల్ట్ లో కూడా ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటుతుంది. ఈ మూవీ రూ. 150 కోట్ల వసూళ్ల వైపు దూసుకెళుతోంది.
సినిమాకున్న డిమాండ్ రీత్యా రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అతిపెద్ద టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్ ఆర్ ఆర్ దాన్ని దాటేందుకు బాక్సాఫీస్ వద్ద యుద్ధం చేస్తుంది. శనివారం ఉగాది పర్వదినం కావడంతో ఆర్ ఆర్ ఆర్(RRR Collections) కి కలిసొచ్చింది. ముఖ్యంగా నైజాంలో భారీ షేర్ రాబట్టింది. శనివారం నైజాంలో రూ. 8.57 కోట్ల షేర్ వసూలు చేసింది. 9వ రోజుకు ఇది రికార్డు షేర్.సీడెడ్ లో రూ. 3.35 షేర్ అందుకుంది. ఉత్తరాంధ్రలో కూడా ఆర్ ఆర్ ఆర్ జోరు మాములుగా లేదు. ఏకంగా రూ. 2.83 కోట్ల వసూళ్లు సాధించింది.
ఇక ఈస్ట్ రూ. 1.22, గుంటూరు రూ.1.03, కృష్ణ రూ. 1.03, నెల్లూరు రూ 0.65 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. ఆంధ్రా నుండి మిగతా ఏరియాల రిపోర్ట్స్ రావాల్సి ఉంది.మొత్తంగా రూ. 25 కోట్ల వరకు ఏపీ/తెలంగాణా షేర్ ఉండే అవకాశం కలదు. ఇక వారం కూడా ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)దే అని చెప్పాలి. దానికి కారణం చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలేమీ విడుదల కాలేదు. కెజిఎఫ్ 2, బీస్ట్ చిత్రాలు విడుదయ్యే వరకు ఆర్ ఆర్ ఆర్ కి బాక్సాఫీస్ వద్ద అడ్డులేదు. రాజమౌళి (Rajamouli) పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా... అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు.
