Asianet News TeluguAsianet News Telugu

రెండో పార్ట్ రిలీజ్ కాకుండానే చిన్న తెరపై?

సంక్రాంతి కానుకగా... విడుదలైన `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమానికు రివ్యూలు బాగా వచ్చినా..భాక్సాఫీస్ దగ్గర నడవటం లేదు. సినిమాలో  సరైన డ్రామా, డెప్త్ లేదంటూ సినిమా బోర్ వచ్చేసింది అని తేల్చేసారు.

NTR Kathanayakudu will be available from Feb 7th in Amazon Prime
Author
Hyderabad, First Published Jan 21, 2019, 7:42 AM IST

సంక్రాంతి కానుకగా... విడుదలైన `ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` ఏ స్దాయిలో డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమానికు రివ్యూలు బాగా వచ్చినా..భాక్సాఫీస్ దగ్గర నడవటం లేదు. సినిమాలో  సరైన డ్రామా, డెప్త్ లేదంటూ సినిమా బోర్ వచ్చేసింది అని తేల్చేసారు. మరో ప్రక్క ఎన్టీఆర్ అభిమానులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ సినిమాని విమర్శిస్తూ రకరకాల పోస్ట్ లు పెట్టారు.

ఇవన్ని కలెక్షన్స్ పై ప్రభావం చూపెట్టాయనటంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం చాలా చోట్ల ధియోటర్స్ నుంచి మాయమైంది. అయితే చిన్న తెరపై అంటే అమిజాన్ ప్రైమ్ లో ప్రత్యక్ష్యం అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం పిభ్రవరి 7 నుంచి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. పిభ్రవరి 14 న మహానాయకుడు చిత్రం రిలీజ్ కానుంది. 

ఇక  ఈ చిత్రం డబ్బై కోట్లు వరకూ బిజినెస్ అయితే ఇరవై ఐదు శాతం కూడా రికవరీ కనపడటం లేదని ట్రేడ్ లో వినపడుతోంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ మహానాయకుడు తీసుకున్నవారిపై ఈ ప్రభావం పడుతోంది. ఈ కలెక్షన్స్ చూసి వారు కంగారుపడుతున్నట్లు సమాచారం. ఇదే పరిస్దితి సెకండ్ పార్ట్ కు కూడా ఉండే ఇంక కోలుకోలేరనే కామెంట్స్ వినపడుతున్నాయి. 

మరో ప్రక్క ఈ విమర్శలు చూసిన దర్శకుడు క్రిష్ మండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సినిమా విలువ తెలియని వారే ఇలా మాట్లాడుతున్నారంటూ అంటున్నారట. ఈ విమర్శలకు సమాధానం సెకండ్ పార్ట్ లో దొరుకుతుందని అంటున్నారట.  `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` వ‌చ్చే నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.   ఇందులో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితాన్ని చూపించనున్నారు. అది కనుక  అసంపూర్తిగానే ముగిస్తే కనుక అదీ ఇబ్బందే. 

సంబంధిత వార్తలు.. 

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

Follow Us:
Download App:
  • android
  • ios