Asianet News TeluguAsianet News Telugu

#Aamir Khan:అయ్యో... OTT కూడా ముంచేసిందే

సోషల్  మీడియాలో  ట్రెండ్ అయిన #BoycottBollywood దెబ్బ‌కు లాల్ సింగ్ చాలా దారుణంగా దెబ్బ‌తిన్నాడు. ఓపెన్సిగ్ లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ఈ ఒక్క హ్యాష్ టాక్ దెబ్బ‌కు 25 శాతం మేర క‌లెక్ష‌న్స్ ప‌డిపోయాయి. ఈ చిత్రం మొదట థియేటర్లలో విడుదలైన ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కావాల్సి ఉంది. 

No OTT buyers for Aamir Khan film after box office failure?
Author
Mumbai, First Published Aug 22, 2022, 10:32 AM IST


అమీర్ ఖాన్,  కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన  లాల్ సింగ్ చద్దా 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని బాలీవుడ్ అంచనా వేసింది. అమీర్ ఖాన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.   నాలుగేళ్ల‌పాటు అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీర్చిదిద్దారు. అయితే ఈ  సినిమాకు క‌నీసం టిక్కెట్లు తెగ‌క‌పోవ‌డంతో ఓవర్ హెడ్ ఖర్చులను త‌గ్గించుకోవ‌డానికి మొదటి రెండు రోజులుగా 1,300 షోలను ఎత్తేశారు. ఈ  సినిమా చూడ‌టానికి ఆడియ‌న్స్ రెడీగా లేర‌ని ట్రేడ్  తేల్చేసింది. 50 కోట్లతో బాక్సాఫీస్ వద్ద రూ.60-70 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిందని వార్తలు వచ్చాయి. 

సోషల్  మీడియాలో  ట్రెండ్ అయిన #BoycottBollywood దెబ్బ‌కు లాల్ సింగ్ చాలా దారుణంగా దెబ్బ‌తిన్నాడు. ఓపెన్సిగ్ లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ఈ ఒక్క హ్యాష్ టాక్ దెబ్బ‌కు 25 శాతం మేర క‌లెక్ష‌న్స్ ప‌డిపోయాయి. ఈ చిత్రం మొదట థియేటర్లలో విడుదలైన ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కావాల్సి ఉంది. అయితే సినిమా డిజాస్టర్ అయ్యాక ఈ సినిమాకు ఇప్పుడు  OTT కొనుగోలుదారులు లేకుండా పోయారు.   Netflix కూడా ఎగ్రిమెంట్ నుంచి తప్పుకుంది.  ఈ మేరకు ముంబై మీడియాలో కథనాలు వస్తున్నాయి.

లాల్ సింగ్ చడ్డా విడుదల ముందు నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమీర్ ఖాన్ నూటా యాభై కోట్లకు ఓటిటి డీల్ అడిగాడట. ప్రైమ్, హాట్ స్టార్ కన్నా గ్లోబల్ రీచ్ దీనికే ఎక్కువ కాబట్టి ఎలాగైనా ఒప్పించాలని అనుకున్నాడు. కానీ అమీర్ అడిగింది మరీ ఎక్కువగా ఉండటంతో సదరు సంస్థ నో అంది. స్ట్రీమింగ్ కు రిలీజ్ తర్వాత తక్కువ గ్యాప్ తో 100 కోట్లలోపైతే ఆలోచిద్దామన్నారు. అయితే అమీర్ నో  అన్నాడు. 125 కోట్లు ప్లస్ ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ కండీషన్ తో మరో ప్రతిపాదన పంపించాడు. దీన్ని నెట్ ఫ్లిక్స్  పెద్దగా కలిసి రాదంది. మరో ప్రక్క   వూట్ సెలెక్ట్  ఓటిటి అయితే ఆరు నెలలు అనేది ఓకే కానీ ధర మాత్రం రిలీజయ్యాక ఫిక్స్ చేద్దామని డీల్ చేసుకుంది. కట్ చేస్తే లాల్ సింగ్ చడ్డా అమీర్ కెరీర్ లోనే కాదు బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

 నెట్ ఫ్లిక్స్ తమ ఆఖరి ప్రపోజల్ గా 80 కోట్లు ఇస్తామని కూడా ఆఫర్ చేశారట అది కూడా ఇప్పుడు పోయినట్లైంది. ఓటిటి కంపెనీలు అన్నట్లు .. ఇచ్చినట్టు నిజంగానే ఆరు నెలల తర్వాత లాల్ సింగ్ చడ్డాని ఓటిటిలో వదిలితే చూసేవాళ్ళు ఉండరనేది నిజం.  

Follow Us:
Download App:
  • android
  • ios