బాలీవుడ్‌లో సూపర్‌ హిట్ వెబ్‌ సిరీస్‌ బ్రీత్‌కు సీజన్‌ 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అయిన ఈ సిరీస్‌లో అభిషేక్‌ బచ్చన్‌, నిత్యామీనన్‌, అమిత్‌సాద్‌లు కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సిరీస్‌ మరో విషయంలో వార్తల్లో నిలిచింది. ఈ షోలో నటి నిత్యామీనన్‌ ఓ హాట్ సీన్‌లో నటించటం ఇప్పుడు వైరల్‌గా మారింది.

బ్రీత్‌ ఇన్ టు ద షాడోస్ వెబ్‌ సిరీస్‌లో నిత్యా లెస్బియన్‌ పాత్రలో నటించింది. ఈ షోలో మరో నటితో నిత్యా మీనన్‌ హాట్ రొమాంటిక్‌ సీన్‌, లిక్‌ లాక్‌ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సన్నివేశంపై పలువురు నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తుండాగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు హోమ్లీ ఇమేజ్‌ ఉన్న నిత్యా సడన్‌గా ఇలాంటి సీన్‌లో నటించటంతో అభిమానులు షాక్‌ అయ్యారు. నిత్యా సంగతి ఎలా ఉన్నా ఈ సీన్‌లో బ్రీత్‌కు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందంటున్నారు విశ్లేషకులు.

అయితే నిత్యా లెస్బియన్‌గా నటించటం ఇదే తొలిసారి కాదు. గతంలో నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అ! సినిమాలో కూడా నిత్య లెస్బియన్‌ పాత్రలో నటించింది.. అయితే ఆ సినిమాలో ఎలాంటి హాట్ సీన్స్‌ లేకపోవటంతో పెద్దగా చర్చ జరగలేదు. ప్రస్తుతం వివాదాస్పద కథతో తెరకెక్కుతున్న ఐరన్‌ లేడీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథతో తెరకెక్కిస్తున్నారు.