Asianet News TeluguAsianet News Telugu

`చెక్‌` ఫస్ట్ గ్లింప్స్ ః అద్భుతంగా చెస్ ఆడే నితిన్‌ దేశ ద్రోహిగా ఎలా మారాడు..

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నితిన్‌ హీరోగా నటించిన `చెక్‌` సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్‌ని తీవ్రవాదిగా ముద్రిస్తారు. శిక్ష కూడా వేస్తారు. 

nithin starrer check movie first glimpse released arj
Author
Hyderabad, First Published Jan 3, 2021, 10:35 AM IST

నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం `చెక్‌`. క్రియేటివ్‌ డైరెక్టర్ చంద్రశేఖర్‌ ఏలేటి దీన్ని రూపొందిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రకుల్‌ లాయర్‌గా, ప్రియా ప్రకాష్‌.. నితిన్‌ లవర్‌గా కనిపిస్తుంది. 

ఇదిలా ఉంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్‌ని తీవ్రవాదిగా ముద్రిస్తారు. శిక్ష కూడా వేస్తారు. `జైల్లో ఆదిత్య అనే తీవ్రవాది చెస్‌ అద్భుతంగా ఆడుతున్నాడు..` అని ఓ వ్యక్తి చెబుతుంటే,  `అద్భుతంగా అంటే? ` విశ్వనాథ్‌ ఆనంద్‌, కస్పరోవ్‌ లాగా అనే సమాధానం ఇస్తాడు. అనంతరం జడ్జ్ ఈ ఐదుగురిని ముద్దాయిలుగా ప్రకటిస్తూ శిక్ష ఖరారు చేస్తారు.  దీనికి పోలీస్‌ ఆఫీసర్‌ అయిన సంపత్‌రాజ్‌ స్పందిస్తూ, తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశ ద్రోహి అది నీ గుర్తింపు.. అంటూ నితిన్‌తో అంటాడు. ఇంతలో యాక్షన్‌ ఎపిసోడ్‌ వస్తుంది. 

తాజా ఫస్ట్ గ్లింప్స్ ని చూస్తుంటే, ఓ తెలివైన వ్యక్తి అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని టెర్రరిస్ట్ గా ముద్రవేసుకుంటాడని, దాన్నుంచి బయటపడేందుకు అతను చేసే పోరాటంనేపథ్యంలో ఈ కథ సాగుతుందని, ఆద్యంతం బ్రిలియంట్‌ స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. తాజా ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. బేసిక్‌గా చంద్రశేఖర్‌ ఏలేటి సినిమాలంటేనే ఓ బలమైన కథతో, సంక్లిష్టమైన స్క్రీన్‌ప్లేతో సాగుతుంటాయి. ఈ క్రమంలో ఆయన సినిమాలు ఆడియెన్స్ ని నిరాశ పరిచాయి కూడా. మరి `చెక్‌` చిత్రం ఎలా మెప్పిస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios