బాలయ్య- బోయపాటి మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఈ సినిమాతోనైనా బాలయ్య భారీ హిట్ కొడితే కాలర్ ఎగరేయాలని ఫిక్స్ అయ్యారు. గత ఏడాది బాలయ్య నుండి ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటిగా కూడా విజయం అందుకోలేదు. ఎన్టీఆర్ బయోపిక్స్ తో చరిత్ర సృష్టిద్దాం అని బాలయ్య అనుకున్నాడు. బాలయ్య కెరీర్ లోనే భారీ డిజాస్టర్స్ గా ఆ చిత్రాలు నిలిచాయి. ఎన్టీఆర్ బియోపిక్స్ బాలయ్యకు భారీ షాక్ ఇవ్వగా, ఏడాది చివర్లో చేసిన రూలర్ సైతం అదే ఫలితం అందుకుంది. 

అందుకే కలిసొచ్చిన దర్శకుడితో బాలయ్య ఫిక్స్ అయ్యాడు. సింహ, లెజెండ్ వంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. బాలయ్య బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో మంచి ఆదరణ దక్కించుకుంది. ఆ వీడియోలో బాలయ్య లుక్ కి పాజిటివ్ కామెంట్స్ రావడం జరిగింది. 

కాగా ఈ మూవీ గురించిన మరొక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. బాలయ్య కు విలన్ గా యువ హీరో నవీన్ చంద్ర చేస్తున్నారట. ఇప్పటికే ఈ విషయమై వీరి మధ్య చర్చలు పూర్తి అయ్యాయని, త్వరలో తిరిగి ప్రారంభం కానున్న మూవీ షూట్ లో నవీన్ చంద్ర పాల్గొననున్నాడు అనేది ఆ వార్తల సారాంశం. ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన అరవింద సమేత మూవీలో నవీన్ చంద్ర విలన్ గా చేసిన సంగతి తెలిసిందే.