Asianet News TeluguAsianet News Telugu

‘వి’ ఇంకో అదిరిపోయే న్యూస్

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన చిత్రం 'V'. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా నిజానికి వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో రిలీజ్ చేయలేకపోయారు.  ఈ సినిమాను ఓటిటి వేదికల ద్వారా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

Nani V  movie will goes to Bollywood
Author
Hyderabad, First Published Aug 20, 2020, 3:04 PM IST

నాని - సుధీర్ బాబు హీరోగా న‌టించిన చిత్రం `వి`. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే అమేజాన్ ప్రైమ్ లో విడుద‌ల కాబోతోంది. దాదాపు 33 కోట్ల‌కు ఈ సినిమాని అమ్మారని టాక్‌. ఒక‌ట్రెండు రోజుల్లో డిజిట‌ల్ ప్ర‌మోష‌న్లు కూడా మొద‌లుకాబోతున్న ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన మరో వార్త సినీ అభిమానుల్లో ఆనందం కలగచేస్తోంది. అదేమిటంటే...రీసెంట్ గా `వి` సినిమాని కొంత‌మంది బాలీవుడ్ నిర్మాత‌లకు చూపించాడ‌ట దిల్ రాజు. వాళ్ల భాగ‌స్వామ్యంతోనే ఈసినిమాని హిందీలో రీమేక్ చేస్తార‌ని తెలుస్తోంది.

ఇప్పటికే దిల్ రాజు ..ఇక్క‌డి సినిమాల్ని హిందీలో రీమేక్ చేసే స‌న్నాహాల్లో బిజీగా ఉన్నారు. తెలుగులో విజ‌య‌వంత‌మైన `జెర్సీ`ని ఇప్ప‌టికే బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. నాని నిర్మాత‌గా రూపొందిన `హిట్` హిందీ రీమేక్ రైట్స్ ఆయ‌న ద‌గ్గ‌రే ఉన్నాయి. ఇప్పుడు `వి` సినిమానీ హిందీలో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేయటం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఇంద్రగంటిమోహన్ కృష్ణనే హిందీ వెర్షన్ ని డైరక్ట్ చేయమని అడుగుతున్నారట.

 ఇక నాని  ఈ చిత్రంలో పూర్తి నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న క్రిమినల్ పాత్రలో కనిపిస్తుండగా.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా సుధీర్‌ బాబు మెప్పించనున్నాడు. ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుని రిలీజ్ కు సిద్దంగా ఉంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన  ఈ సినిమాని సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సన్నాహాలు చేస్తున్నారట. 

Follow Us:
Download App:
  • android
  • ios