నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'బిగ్ బాస్' సీజన్ 2 ఇప్పటికే 88 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ షో పూర్తి కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. హౌస్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో తనీష్, కౌశల్, గీతా మాధురి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇది ఇలా ఉండగా.. షో మొదలైన దగ్గర నుండి నాని హోస్టింగ్ పై తీవ్ర విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి.

సీజన్ 1లో ఎన్టీఆర్ ని మించి నాని చేయలేకపోతున్నాడని, ఆయనతో పోలుస్తూ నానిపై కామెంట్స్ చేశారు. ఇక తాజాగా కీలకమైన ఎలిమినేషన్స్ విషయంలో ప్రజల ఓట్లను లెక్క చేయకుండా తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారనేది తాజా ఆరోపణ. నాని కొందరు కంటెస్టెంట్స్ పట్ల పక్షపాతం చూపుతున్నాడని, ఆయనకి కావాల్సిన వాళ్లని మాత్రమే హౌస్ లో ఉంచుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

నూతన్ నాయుడు ఎలిమినేషన్ తో ఈ ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. దీనికోసం నాని ఓ ప్రకటన కూడా విడుదల చేశాడు. అందరినీ ఒకలానే చూస్తానని ఎలాంటి పక్షపాతం చూపించడం లేదని అన్నారు. అయితే సీజన్ 1 లో ఎన్టీఆర్ పై కూడా ఈ విధమైన ఆరోపణలే వినిపించాయి. ఆయన సూచనల మేరకే షో నుండి ప్రిన్స్ ని ఎలిమినేట్ చేసి ఆదర్శ్ ని ఉంచారని, అలానే ముమైత్ ఖాన్ ని ఎలిమినేట్ చేసి మళ్లీ సీక్రెట్ రూమ్ లో ఉంచారంటూ విమర్శలు వచ్చాయి.

చివరికి శివబాలాజీని విన్నర్ గా చేయడంలో కూడా ఎన్టీఆర్ పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: కౌశల్.. కావాలని కెలుక్కోకు.. గీతామాధురి వార్నింగ్!

గీతామాధురిపై సెటైర్లు.. భర్త నందు ఆగ్రహం!

బిగ్ బాస్2: గీతామాధురి డాన్స్ పై కౌశల్ ఆర్మీ సెటైర్లు!

బిగ్ బాస్ హౌస్ లో స్టార్ హీరోలను పెట్టాలి.. కౌశల్ నా ఫేవరేట్ నటి సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బాస్ నాకు డబ్బులివ్వలేదు.. గణేష్ కామెంట్స్!