గీతామాధురిపై సెటైర్లు.. భర్త నందు ఆగ్రహం!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 6, Sep 2018, 5:17 PM IST
Actor Nandu defends Geetha Madhuri, slams abusive trolls
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న గీతామాధురిపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి.

బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న గీతామాధురిపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి. కౌశల్ తో ఆమె ప్రవర్తన కౌశల్ ఆర్మీకి కోపం తెప్పించడంతో ఆమెపై ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు. కౌశల్ ని గీతా తనకొచ్చిన పవర్ తో సీజన్ మొత్తం నామినేట్ చేయడంతో ఆమెపై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది.

అసభ్యకర పదజాలంతో ఆమె కామెంట్స్ చేస్తుండడంతో గీతా భర్త నందు ఆగ్రహం వ్యక్తం చేశాడు.  నందు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే పెట్టిన కొద్ది సమయంలోనే ఆ వీడియోను తొలగించాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. బిగ్ బాస్ అనేది గేమ్ షో.. అందులో జరిగే పరిణామాలపై అభిప్రాయలు వ్యక్తం చేయడంలో తప్పు లేదు కానీ వ్యక్తిగతమైన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు.

ఒక మహిళను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం మన సంస్కారం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కారణంగా గీతామాధురిపై నెగెటివిటీ మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని వీడియోని డిలీట్ చేసినట్లుగా టాక్.   

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: గీతామాధురి డాన్స్ పై కౌశల్ ఆర్మీ సెటైర్లు!

బిగ్ బాస్ హౌస్ లో స్టార్ హీరోలను పెట్టాలి.. కౌశల్ నా ఫేవరేట్ నటి సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బాస్ నాకు డబ్బులివ్వలేదు.. గణేష్ కామెంట్స్!

loader