బిగ్ బాస్ సీజన్2 లో రెండు రోజుల పాటు 'టాలీవుడ్ మారథాన్' టాస్క్ సాగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు తమకి కేటాయించిన పాట వచ్చేప్పుడు హౌస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లోర్ మీదకు వెళ్లి డాన్స్ చేయాలి. ఆలస్యంగా స్టేజ్ మీదకు వెళితే లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో పాయింట్స్ తగ్గుతాయి.

అయితే గీతామాధురికి రంగస్థలం సినిమాలో 'జిగేలు రాణి' పాట ఇచ్చారు. హౌస్ లో అందరూ తమదైన స్టయిల్ లో డాన్స్ చేసి మెప్పించగా.. గీతా డాన్స్ ని మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సీజన్ ఆరంభం నుండి శారీరక శ్రమకు సంబంధించి ఏమైనా టాస్క్ లు ఇస్తుంటే ముందుగానే ఓడిపోయినట్లు అంగీకరించేస్తుంది గీతా.

కానీ ఈసారి డాన్స్ టాస్క్ నుండి తప్పించుకోలేకపోయింది. ఆమె చేసిన డాన్స్ ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో కౌశల్ ఆర్మీకి ఛాన్స్ దొరికినట్లయింది. మూడు వారాలుగా గీతామాధురిపై గుర్రుగా ఉన్న వారు ఇప్పుడు ఆమె డాన్స్ పై విమర్శలు చేస్తూ మీమ్స్ లో తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు.