టాలీవుడ్ పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన మాధవీలతా ప్రస్తుతం బిజేపీలో కార్యకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. పార్టీ పనులతో పాటు అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూల్లో కూడా దర్శనమిస్తుంది ఈ బ్యూటీ. మొన్నామధ్య కాస్టింగ్ కౌచ్ విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

తాజాగా బిగ్ బాస్ షో అలానే స్టార్ హీరోలపై విమర్శలు చేస్తూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోలను బిగ్ బాస్ హౌస్ లో పెట్టాలని అప్పుడు వారి నిజ స్వరూపం ప్రజలను తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ''బిగ్ బాస్ రియాలిటీ షోలో మన స్టార్ హీరోలను పెడితే అప్పుడు వారు తమను తాము మర్చిపోయి కొట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం మనం చూడొచ్చు.

వాళ్ల నిజస్వరూపాలు చూసి అభిమానులు పారిపోతారు'' అంటూ మాధవీలత చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. ఇక బిగ్ బాస్ షో మొత్తం స్క్రిప్టెడ్ అని ప్రేక్షకుల ఓట్లకు విలువివ్వకుండా తమ ఇష్టానుసారం ఎలిమినేషన్ చేస్తున్నట్లు విమర్శలు చేసింది. బిగ్ బాస్ ఇంట్లో ఉంటోన్న కౌశల్ అంటే తనకు ఇష్టమని అతడు మాత్రమే ఆటను ఆటగా ఆడుతున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.