బిగ్ బాస్ సీజన్ 2 12 వారాలను పూర్తి చేసుకొని 13వ వారంలోకి చేరువైంది. హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే మిగిలి ఉండడంతో హౌస్ లో పోరు రసవత్తరంగా సాగుతోంది. గత కొన్ని రోజులుగా హౌస్ లో గీతామాధురి, కౌశల్ ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం లైట్లు ఆన్ చేసి ఉన్నంతవరకు హౌస్ లో ఎవరూ పడుకోకూడదు. ఆ రూల్ ని అతిక్రమించారంటూ కౌశల్.. గీతామాధురిపై విరుచుకుపడ్డారు. గీతామాధురి, దీప్తి, శ్యామల ఒకే మంచంపై పడుకొని పాటలు పాడుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. ఈ పాయింట్ ని లాగుతూ 'నిద్రపోయి ఫ్రెష్ గా వచ్చారు' అంటూ కౌశల్ కామెంట్ చేశాడు.

దీంతో గీతామాధురి అతడిపై ఫైర్ అయింది. ''కౌశల్ మీరు కావాలని కెలుక్కోకండి.. అయినా మా నిద్ర మా ఇష్టం. కుక్కలు మొరగలేదు కదా మరి మీరు ఎందుకు ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. మీ స్ట్రాటజీలు మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు మీరు కావాలని నాతో గొడవ పడితే అప్పుడు నేను మాట్లాడే మాటలతో జనాల్లో నన్ను బ్యాడ్ చేయాలని అనుకుంటున్నారు. అదే మీ గేమ్ ప్లాన్. మీతో పడలేకపోతున్నా.. నన్ను ఎలిమినేషన్ కి నామినేట్ చేసేయండి' అంటూ అతడిపై ఫైర్ అయింది. గీతకు సపోర్ట్ గా దీప్తి, తనీష్ లు మాట్లాడారు.