బిగ్ బాస్ నాకు డబ్బులివ్వలేదు.. గణేష్ కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 5, Sep 2018, 5:39 PM IST
commoner ganesh comments on bigg boss show
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 పై మొదట్లో విమర్శలు వినిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షో ముగింపు దశకు చేరుకునేకొద్దీ టాస్క్ లో పై మరింత శ్రద్ధ పెట్టి ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు హౌస్ మేట్స్

బిగ్ బాస్ సీజన్ 2 పై మొదట్లో విమర్శలు వినిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షో ముగింపు దశకు చేరుకునేకొద్దీ టాస్క్ లో పై మరింత శ్రద్ధ పెట్టి ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు హౌస్ మేట్స్. 16 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఎనిమిది మంది మాత్రమే మిగిలారు.దీంతో ఇప్పుడు ఎలిమినేషన్ కీలకంగా మారింది.

గత వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో హౌస్ నుండి ఇద్దరు కామన్ మ్యాన్లు గణేష్, నూతన్ నాయుడులు బయటకి వచ్చేశారు. ఫైనల్స్ వరకు ఉంటానని భావించిన గణేష్ బయటకి వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు. పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. హౌస్ లో ఎలా ఉండేదనే విషయాలను వెల్లడించారు. తినడానికి సరైన తిండి ఉండేది కాదని, బయటకి రావడం ఓ రకంగా సంతోషంగా ఉన్నప్పటికీ మరోపక్క బాధగా కూడా ఉందని వెల్లడించారు.

ఇక హౌస్ లో వెళ్లిన వారికి ఒక్కొక్కరికి వారిని స్థాయిని బట్టి రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తనకు మాత్రం డబ్బు ఇవ్వలేదని అంటున్నాడు గణేష్. ప్రమాణపూర్తిగా చెబుతున్నా.. హౌస్ లోకి వెళ్లినందుకు నాకు బిగ్ బాస్ టీమ్ డబ్బివ్వలేదు.. కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తానంటూ చెప్పుకొచ్చాడు. 

loader