Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ క్యారక్టర్ లీక్ చేసిన నాగ్ అశ్విన్

సినిమా బాగుండి ఉంటే ఓ రేంజిలో ఉండదని ప్రభాస్ స్టామినా గురించి ఇండియన్ బాక్సాఫీస్‌కు డిస్కస్ చేసింది. దాంతో ప్రభాస్ వేసే ప్రతీ అడుగు ప్యాన్ ఇండియా చిత్రాలని దృష్టిలో పెట్టుకునే సాగుతోంది. ఈ నేపద్యంలో ప్రభాస్ చేయబోయే ప్రతీ పాత్ర డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఆయన కొత్త సినిమాల్లో ఏ పాత్ర చేయబోతున్నారనేది అంతటా ఆశక్తికరమైన అంశంగా మారింది. 

Naga Aswin about prabhas character in adipurush
Author
Hyderabad, First Published Aug 19, 2020, 10:16 AM IST


బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్క సారిగా ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. సాహో సినిమాతో ఇక్కడ ఎలా ఉన్నా నార్త్ లో తన  సత్తాను చాటుకున్నాడు. సినిమా బాగుండి ఉంటే ఓ రేంజిలో ఉండదని ప్రభాస్ స్టామినా గురించి ఇండియన్ బాక్సాఫీస్‌కు డిస్కస్ చేసింది. దాంతో ప్రభాస్ వేసే ప్రతీ అడుగు ప్యాన్ ఇండియా చిత్రాలని దృష్టిలో పెట్టుకునే సాగుతోంది. ఈ నేపద్యంలో ప్రభాస్ చేయబోయే ప్రతీ పాత్ర డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఆయన కొత్త సినిమాల్లో ఏ పాత్ర చేయబోతున్నారనేది అంతటా ఆశక్తికరమైన అంశంగా మారింది. 

ఈ నేపధ్యంలో తాజాగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను చేయబోతోన్నట్టు ప్రకటించాడు ప్రభాస్. అది కూడా టీ సిరీస్ వంటి భారీ ప్రొడక్షన్ కంపెనీలో భారీ త్రీడీ పిక్చర్‌ను తెరకెక్కించబోతోన్నారు. ఆది పురుష్ అంటూ విడుదల చేసిన పోస్టర్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలో “ఆది పురుష్” సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటి? మూవీ కథ ఏంటనే విషయంలో చాలా చర్చ జరగటం అతి సహజం.

చివరికి ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ కి, “ఆది పురుష్”కి ఏంటి సంబంధం అని ఎక్కువ ఆలోచించద్దు. ప్రభాస్ 21వ చిత్రం తీస్తున్న డైరక్టర్ కు తన హీరో చేయబోయే పాత్ర గురించి ముందే తెలయటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.  నాగ్ అశ్విన్… ప్రభాస్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశాడు. అందులోనే… రాముడిగా ప్రభాస్ నటించబోతున్నాడని, ఆ దేవుడి పాత్రలో అతికొద్దిమంది నటులు మాత్రమే రాణించారన్నట్లుగా మెన్షన్ చేశాడు. అలా…. ప్రభాస్ కొత్త సినిమాపై ఉన్న అన్ని డౌట్స్ కి ఎండ్ కార్డు పండటం జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios