బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంట అంటే మొదట గుర్తు వచ్చే పేరు మోనాల్-అఖిల్. వీరిద్దరూ మొదటి నుండి చాలా దగ్గరగా ఉంటున్నారు. హౌస్ నుండి బయటికి వచ్చిన దేవి నాగవల్లి,స్వాతి దీక్షిత్ ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్పారు. అఖిల్ మోనాల్ డీప్ లవ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఐతే మోనాల్ అభిజిత్ తో కూడా సన్నిహితంగా ఉండడం అనేది ప్రేక్షకులలో ఆసక్తి రేపుతోంది. నేటి ఎపిసోడ్ లో జరిగిన ఓ సంఘటన మోనాల్-అఖిల్ మధ్య రొమాన్స్ కి తార్కాణంగా నిలిచింది. 

సోఫాలో పడుకున్న మోనాల్ చేతిని పట్టుకొని అఖిల్ మాట్లాడుతుండగా, అభిజిత్ వచ్చాడు. అభిజిత్ ని చూసిన మోనాల్ అతనికి స్మైల్ ఇవ్వడం జరిగింది. నా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అఖిల్ మోనాల్ తో అన్నాడు. అభిజిత్ కి కూడా మోనాల్ స్పందించడం అఖిల్ కి నచ్చడం లేదని అర్థం అయ్యింది. నీ బాధ ఏమిటో నాకు అర్థం కావడం లేదు అని మోనాల్ అనగా, అసహనంగా అక్కడి నుండి వెళ్లిపోవడానికి అఖిల్ ప్రయత్నించాడు. 

వెళుతున్న అఖిల్ ని వెళ్ళొద్దని మోనాల్ రొమాంటిక్ గా ఆపింది. నాకు మొన్న హెల్త్ బాగాలేదు. అప్పుడు నువ్వు నా పక్కన కాసేపు కూర్చుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యానని, నువ్వు నా మెడిసిన్ అని చెప్పింది. దానికి అఖిల్ సమాధానంగా మెడిసిన్ ఎక్సపైర్ అయిపోయింది అన్నాడు. మోనాల్ కి అఖిల్ మీద ప్రేమ తగ్గిందనో, తనకు మోనాల్ మీద ప్రేమ తగ్గిందనో అర్థం వచ్చేలా ఆ డైలాగ్ ఉంది. ఏది ఏమైనా హౌస్ లో అఖిల్ మోనాల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది.