Asianet News TeluguAsianet News Telugu

మనవడితో కలిసి మోహన్ బాబు స్టెప్పులు.. విష్ణు కొడుకు అదరగొట్టాడుగా.. వైరల్ వీడియో.!

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) తాజాగా తన మనవడితో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ‘జిన్నా’ ఈవెంట్ లో చేసిన డాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 

Mohan Babu Dance with His Grandson at the Ginna Pre Release Event, Video Viral!
Author
First Published Oct 17, 2022, 8:20 PM IST

ఎలాంటి వేదికపైనైనా తనదైన శైలిలో ఆకట్టుకుంటారు కలెక్షన్ కింగ్, టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు. సుధీర్ఘమైన స్పీచ్ ఇవ్వడంతో పాటు అప్పుడప్పుడు చిందులు కూడా వేస్తుంటారు. తాజాగా  కొడుకు మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘జిన్నా’ (Ginna) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. తన స్పీచ్ అనంతరం.. ఈవెంట్ చివరి క్షణాల్లో తన మనవడు అర్వం (Arvam)తో కలిసి స్టేజీపై స్టెప్పులేశారు. 

‘నువ్వొస్తావని నేను..’ అనే జానపద పాటకు మనవుడు, మోహన్ బాబు చాలా ఉత్సాహంగా చిందులేశారు. ఇద్దరూ స్టెప్పులేస్తుండటంతో మధ్యలో ప్రముఖ కమెడియన్, నటుడు అలీ కూడా వచ్చి చేరారు. అలీ జాయిన్ అవ్వడంతో విష్ణు కొడుకు మరింత జోష్ గా స్టెప్పులేశాడు. దీంతో ఈవెంట్ లోని సభ్యులంతా ఖుషీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటం విశేషం. 

ఇక మంచు విష్ణు వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు. గత సినిమాల కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ‘జిన్నా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. గ్లామర్ బ్యూటీలు పాయర్ రాజ్ పుత్ (Payal Rajput), సన్నీ లియోన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ కూడా ముఖ్య పాత్రలో అలరించనున్నారు. వీకే నరేష్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, సత్యం రాజేష్, సురేష్ తదితర పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్ 21న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios