Asianet News TeluguAsianet News Telugu

చిరు లీక్స్ వీడియో.. తమన్నా, కీర్తి సురేష్ తో మెగాస్టార్ అల్లరే అల్లరి.. గ్రాండ్ సెట్ లో హంగామా..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

Megastar Chiranjeevi leaks video of Bholaa Shankar dtr
Author
First Published Jun 8, 2023, 5:40 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. తనకి ఈ చిత్రం చాలా కీలకం కావడంతో మెహర్ రమేష్ జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన భోళా శంకర్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇదిలా ఉండగా చిరు ఎప్పటిలాగే తన లీక్స్ మొదలు పెట్టారు. చిరు లీక్స్ పేరుతో చిరంజీవి తన చిత్రాల గురించి కీలక విషయాలు లీక్ చేస్తూ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా చిరు చేసిన లీక్ క్రేజీగా ఉంది. భోళా శంకర్ చిత్రంలోని సంగీత్ నేపథ్యంలో వచ్చే సాంగ్ కి సంబంధించిన వీడియో చిరు లీక్ చేశారు. 

ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్రలో నటిస్తోంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంగీత్ సాంగ్ కోసం కలర్ ఫుల్ గా గ్రాండ్ సెట్ ఏర్పాటు చేశారు. షూటింగ్ కి ఆర్టిస్టులు అంతా సిద్ధంగా ఉన్నారు. ఇక చిరు కీర్తి, తమన్నా లతో ముచ్చట్లు పెట్టుకుని తెగ అల్లరి చేస్తున్నారు. 

ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. వీడియోలో ఆయన్ని కూడా చూడవచ్చు. అలాగే కమెడియన్లు వెన్నెల కిషోర్, రఘుబాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, వైవా హర్ష కూడా కనిపిస్తున్నారు. సెట్ మొత్తం ఆర్టిస్టులు, మెగాస్టార్ హంగామాతో సందడిగా ఉంది. చిరు అయితే కీర్తి సురేష్, తమన్నా లతో ఉంటూ బాగా హంగామా చేస్తున్నారు. ఒక సందర్భంలో చిరు కీర్తి సురేష్ గొంతుని సరదాగా పట్టుకోవడం కూడా చూడొచ్చు. సంగీత్ సాంగ్ అయినప్పటికీ 'జామ్ జామ్ జామ్ జజ్జినక తెల్లార్లు ఆడుదాం తైతక్క' అంటూ హుషారెత్తించే లిరిక్స్ వినిపిస్తున్నాయి. 

ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగష్టు 11న భోళా శంకర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios