Asianet News TeluguAsianet News Telugu

Ravi Teja: మాస్ మహారాజ్ మెగా ఫ్లాన్... సైలెంట్ గా పాన్ ఇండియాకు రవితేజ..?

ప్రస్తుంతం టాలీవుడ్(Tollywood) లో ప్యాన్ ఇండియా ఫీవర్ నడుస్తుంది. చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకూ ప్యాన్ ఇండియా సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు. బాహుబలి తరువాత తెలుగు సినిమా క్రేజ్ భారీగా పెరగడంతో.. మన స్టార్స్ అంతా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి కే చాలా మంది తెలుగు హీరోలు ఆ ప్రయత్నాల్లో ఉండగా.. ఆలిస్ట్ లోకి ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja)  కూడా చేరాడు. 

Mass Maharaj Ravi Teja Bollywood Entry
Author
Hyderabad, First Published Jan 26, 2022, 7:04 AM IST

ప్రస్తుంతం టాలీవుడ్(Tollywood) లో ప్యాన్ ఇండియా ఫీవర్ నడుస్తుంది. చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకూ ప్యాన్ ఇండియా సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు.బాహుబలి తరువాత తెలుగు సినిమా క్రేజ్ భారీగా పెరగడంతో.. మన స్టార్స్ అంతా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి కే చాలా మంది తెలుగు హీరోలు ఆ ప్రయత్నాల్లో ఉండగా.. ఆలిస్ట్ లోకి ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja)  కూడా చేరాడు.

టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతారు అనడానికి బెస్ట్ ఎక్జాంపుల్ పుష్ప మూవీ. ఈ  సినిమాతో బన్నీ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్లాడు. ఈ సినిమా సౌత్ లాంగ్బేజ్ లతో పాటు నార్త్ లో కూడా దుమ్ము రేపింది. ఒక్క హిందీ వెర్షన్ మూవీనే దాదాపు 90 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించింది. తెలుగు సినిమా సత్తాను మరోసారి ఉత్తరాదిన చాటి చెప్పింది పుష్ప (Pushpa) సినిమా. దాంతో.. మన హీరోలలో మరింత ధైర్యం పెరిగింది. ఈ మూవీ  ఇచ్చిన సపోర్ట్ తో మరి కొంత మంది హీరోలు నార్త్లోనూ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

పాన్ ఇండియా లిస్ట్ లోకి ఇఫ్పుడు మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)  కూడా చేరిపోయారు. ప్రస్తుతం ఆయ చేస్తున్న ఖిలాడీ(Khiladi) సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఆయనతో కలిసి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ సహ నిర్మాతగా ఉన్నారు.   మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈసినిమాలో రవితేజ(Ravi Teja)  డ్యూయల్ రోల్ చేస్తున్నారు..

అయితే రానున్న వారాల్లో హిందీ నుంచి పెద్దగా సినిమా రిలీజ్ లు ఏవీ లేవు.  దాంతో మన హీరోలు తమ చిత్రాల హిందీ వెర్షన్ లని రిలీజ్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో ఖిలాడి(Khiladi) సినిమా హిందీ వెర్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో బాలీవుడ్ నటులు ముఖేష్ రుషి, నికితిన్ ధీర్, సచిన్ ఖేడేకర్ ఠాకూర్, అనూప్ సింగ్ లాంటివారు కీలక పాత్రల్లో నటిస్తుండటం కలిసొస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

అంతే కాదు ఈమూవీ కథ, స్క్రీన్ ప్లే  బాలీవుడ్ ప్రేక్షకుల్ని మొప్పిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అందుకే ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇంతకు ముందు రవితేజ (Ravi Teja)  సినిమాలేవి హిందీలో థియేటర్ రిలీజ్  అవ్వలేదు. దాంతో మాస్ మహారాజ్ ఫస్ట్  హిందీ మూవీగా ఖిలాడిని పుష్ప రేంజ్ లో బాలీవుడ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఇక ఈ మూవీని పిబ్రవరి 11న థియేటర్స్ లో రిలీజ్  చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఈ డేట్  మార్చే ప్రసక్తే లేదంటూ.. క్లారిటీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే డేట్ న ఖిలాడి(Khiladi) హిందీ వెర్షన్ మూవీని కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక మాస్ మహారాజ్ ఖిలాడి హిందీ వెర్షన్.. నార్త్ ఆడియన్స్ ను ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios