Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామంటున్న `మా` అధ్యక్షుడు మంచు విష్ణు..

డ్రగ్స్ నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాడు `మా` అధ్యక్షుడు మంచు విష్ణు. తాజాగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

manchu vishnu said that work together with telangana government for drugs free state arj
Author
First Published Feb 5, 2024, 10:47 PM IST

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణు ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం ముందుకొచ్చాడు. డ్రగ్స్ ని నిర్మూలించే కార్యక్రమంలో `మా` భాగం అవుతుందని తెలిపారు. ఇటీవల మంచు విష్ణు.. తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు తీరి రెండు నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశాడు మంచు విష్ణు. ఆయనతోపాటు నటులు శివబాలాజీ, రఘుబాబు ఉన్నారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేశారు. వారికి అభినందనలు తెలిపారు. కొత్త ఏర్పడిన ప్రభుత్వానికి తమ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఇండస్ట్రీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా మంచు విష్ణు సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాలను షేర్‌ చేసుకున్నారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు పేర్కొంటూ,`తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నో విషయాల మీద చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, డ్రగ్స్ ఫ్రీ సొసైటి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి ప్రభుత్వంతో మేమంతా ఐకమత్యంగా కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నాం` అని మంచు విష్ణు  తెలిపారు.

విష్ణు మంచు ప్రస్తుతం పాన్‌ ఇండియా మూవీ `కన్నప్ప`లో నటిస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి దిగ్గజాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్‌కి సంబంధించిన డిటెయిల్స్ తెలియాల్సి ఉంది.  

Read more: `కల్కి2898ఏడీ` వాయిదా?.. కారణమేంటి? నిజం ఏంటి?.. కొత్త డేట్‌ ఎప్పుడంటే?
 

Follow Us:
Download App:
  • android
  • ios