తమన్నా ఐటెం సాంగ్ చేసిందంటే ఆ చిత్రానికి తప్పుకున్నా ఎక్స్ట్రా మైలేజి వస్తుంది. ఏమన్నా గ్లామర్ అంటే యువత అంతలా ఎగబడతారు. అల్లుడు శీను, జై లవకుశ, గని చిత్రాల్లో తమన్నా ఐటెం నంబర్స్ చేసింది.

తమన్నా ఐటెం సాంగ్ చేసిందంటే ఆ చిత్రానికి తప్పుకున్నా ఎక్స్ట్రా మైలేజి వస్తుంది. ఏమన్నా గ్లామర్ అంటే యువత అంతలా ఎగబడతారు. అల్లుడు శీను, జై లవకుశ, గని చిత్రాల్లో తమన్నా ఐటెం నంబర్స్ చేసింది. గత ఏడాది రజనీకాంత్ జైలర్ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్, చిన్న పాత్రలో ఊపు ఊపేసింది. 

జైలర్ చిత్రానికి అంతలా హైప్ వచ్చిందంటే తమన్నా స్పెషల్ సాంగ్, అందులో ఆమె డ్యాన్స్ ప్రభావం కూడా ఉంది. తాజాగా తమన్నా మరో ఐటెం సాంగ్ తో వచ్చేసింది. రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్ నటిస్తున్న స్త్రీ 2 చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

ఈ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. ఆజ్ కి రాత్ అనే వీడియో సాంగ్ ని స్త్రీ చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు. ఈ సాంగ్ లో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు తన డ్యాన్స్ గ్లామర్ తో తమన్నా చూపు తిప్పుకోలేని విధంగా మెరిసింది. 

తమన్నా గ్లామర్, డ్యాన్స్ మూమెంట్స్ సాంగ్ లో హైలైట్ అవుతున్నాయి. కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో తమన్నా డ్యాన్స్ నంబర్ పెట్టారు. సచిన్ జిగార్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.