తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సెలబ్రిటీలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. 

తాజాగా మంచులక్ష్మీ ఓటు వేయడానికి జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్కరినీ ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. ''నేను ఓటు వేయడం ఎంత ముఖ్యమంటే.. ఎవరికి వేస్తున్నామనేది ముఖ్యం కాదు ఎంత మంది వేస్తున్నారని తెలిస్తేనే మనం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నామనేది తెలుస్తుంది.

నచ్చిన నాయకుడికి ఓటు వేయండి.. మీకు నచ్చకపోయినా ఆ విషయాన్ని కూడా తెలియజేయండి. కానీ ఓటు మాత్రం వేయకుండా ఉండకండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మన బాధ్యతను మనం సీరియస్ గా తీసుకోవాలి. వంద శాతం ఓటు వేయాలని అభిమానులకు సూచిస్తున్నాను. అందరూ బయటకి రావాలి.. ఓటు వేయాలి. 

నా కూతురిని కూడా పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చాను. ఇప్పటినుండే తనకు నేను నేర్పించాలని అనుకుంటున్నాను. నాన్న గారికి ఓటు ఇక్కడ లేదు.. వారందరికీ తిరుపతిలో ఉంది. ఎవరు గెలుస్తారని కాదు ఎవరు ప్రజలకు బాగా పని చేస్తారనేది ముఖ్యం. గత ఎన్నికల్లో 68% పోల్ అయిందని విన్నాను.. ఇప్పుడు ఆ శాతం పెరుగుతుందని అనుకుంటున్నాను'' అంటూ వెల్లడించారు. 

భారీ క్యూలో నిల్చున్న ఎన్టీఆర్!

ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి!

ఓటేసిన వెంకటేష్, నితిన్!

ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, నాగార్జున, అమల!

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి.. హరీష్ రావు

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి