Asianet News TeluguAsianet News Telugu

నోరు జారిన మలయాళ మెగాస్టార్, క్షమాపణలు కోరిన మమ్ముట్టి, మండిపడుతున్న నెటిజన్లు

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఏదో ఒక టైమ్ లో.. ఏదో ఒక సందర్భంలో నోరు జారక తప్పదు.. విమర్షల్ ఫేస్ చేయక తప్పదు. ప్రస్తుతం ఆ పరిస్తితుల్లోనే ఉన్నాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. 

Mammootty Apologises After Over Comments On Director
Author
First Published Dec 15, 2022, 2:07 PM IST

మలయాళం  స్టార్ హీరో మమ్ముట్టి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఏదో పొగిడేద్దామనుకుని మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ అవ్వడంతో.. చేసేది లేక క్షమాపణలు కూడా చెప్పారు. మాలీవుడ్ యంగ్ డైరెక్టర్  జూడ్ ఆంథనీ జోసెఫ్ పై ఆయన విసిరిన పొగడ్తలు కాస్తా..  వివాదానికి కారణమయ్యాయి. గొప్పోడు అని మమ్ముట్టి పొగిడితే... బాడీ షేమింగ్ అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు నెటిజన్లు. చివరకు ఈ గోల తట్టుకోలేకు ఆయన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెప్పారు. 

ఇక అసలు విషయం ఏంటీ..? వివరాల్లోకి వెళ్తే... జూడ్ ఆంథనీ జోసెఫ్  తెరకెక్కించిన సినిమా 2018. ఈమూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు మమ్ముట్టి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ను మమ్ముట్టి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జోసెఫ్ ను పొగడ్తలతో ముంచెత్తారు.. పనిలో పనిగా ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. జోసెఫ్  తలపై ఎక్కువ జుట్టు లేకపోవచ్చు కానీ, ఆయన చాలా తెలివైనవాడు అని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. 

ఏదో పొగడాలి అని మమ్ముట్టి అన్న మాటలు నెగెటివ్ గా తీసుకున్నారు కొందరు నెటిజన్లు. జోసెఫ్ ను మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశారని విమర్శించడం మొదలెట్టారు. సోసల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో మమ్ముట్టి  ఈ విషయంలో స్పందించారు.. జోసెఫ్ ను ప్రశంసిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు కొందరిని బాధించాయని, తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని మమ్ముట్టి అన్నారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. 

 

ఇక ఇంత వివాదానికి సెంటర్ పాయింట్ లాంటి దర్శకుడు జోసెఫ్ కూడా ఈ విషయంలో స్పందించారు. మమ్ముట్టికి మద్దతుగా జోసెఫ్ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. తనకు ఎక్కువ జుట్టు లేకపోవడం వల్ల తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ బాధపడటం లేదని అన్నారు. మమ్ముట్టి వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తన హెయిర్ లాస్ పట్ల ఎవరైనా నిజంగా ఆందోళన చెందుతుంటే... షాంపూ కంపెనీలు, నీటిని సరఫరా చేస్తున్న బెంగళూరు కార్పొరేషన్ కు వ్యతిరేకంగా తమ పోరాటం సాగించాలని అన్నారు యువ దర్శకుడు 

 

Follow Us:
Download App:
  • android
  • ios