మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు అధ్యక్షుడు శివాజీరాజా. మా అసోసియేషన్ రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నిధుల కోసం అమెరికాలో చిరంజీవితో నిర్వహించిన కార్యక్రమంలో కొంత డబ్బుని మిస్ యూజ్ చేశారని, ఈ విషయంలో శివాజీరాజాకి 'మా'లో మరికొంతమంది మెంబర్స్ సహాయం చేశారని టాక్.

ఈ విషయంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి నిజాలు తెలుసుకోవాలని ప్రధాన కార్యదర్శి  నరేష్ అంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా చల్లారలేదు. ఈ విషయం తేలేవరకు మరో ఫారెన్ టూర్ వేయడానికి వీళ్లేదని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వచ్చే నెలలో అమెరికాలో మహేష్ బాబుతో ఈవెంట్ చేయించాలని 'మా' అసోసియేషన్ భావించింది.

ప్రధాన కార్యదర్శి నరేష్.. నమ్రతతో మాట్లాడి ఫైనల్ చేస్తే.. శివాజీరాజా వర్గం డైరెక్ట్ గా ఆమెతో డీల్ చేశారని ఇటీవలి ప్రెస్ మీట్ లో నరేష్ తెలిపారు. మహేష్ ఈ ప్రోగ్రాం చేస్తే 'మా'కి కోటి రూపాయలు నిధులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మహేష్ బాబు 'మా' అసోసియేషన్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ఇటువంటి పరిస్థితుల్లో షో చేయడం కరెక్ట్ కాదని భావించి క్యాన్సిల్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.  

ఇవి కూడా చదవండి..

'మా' వివాదం.. చిరంజీవిని ఇరికిస్తున్నారా..?

ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్లు.. 'మా' వివాదంపై శ్రీరెడ్డి కామెంట్స్!

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

చిరంజీవి నాతో అలా చెప్పారు.. 'మా' వివాదంపై నరేష్!

కోటి రూపాయలతోనే అనుమానం.. శివాజీరాజాపై నరేష్ అసహనం!