మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించిన ప్రజల సొమ్ముని అధ్యక్షుడు శివాజీరాజా కొందరు సభ్యులతో కలిసి దుర్వినియోగం చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ వార్తలను ఖండిస్తూ శివాజీరాజా ఓ ప్రెస్ మీట్ ను నిర్వహిస్తే దానికి కౌంటర్ ఎటాక్ గా ప్రధాన కార్యదర్శి నరేష్ మరో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి నిజాలను బయటపెట్టే ప్రయత్నాలు చేశారు.

శ్రీరెడ్డి విషయంలో కూడా శివాజీరాజా సొంత నిర్ణయాలు తీసుకున్నారని, మా తీరుని తప్పుబట్టారు. తాజాగా నరేష్ వ్యాఖ్యలపై స్పందించిన నటి శ్రీరెడ్డి.. శివాజీరాజాపై మండిపడింది. ''నేను చేస్తోన్న పోరాటాన్ని శివాజీరాజా, శ్రీకాంత్ పబ్లిసిటీ స్టంట్ అన్నారు. అందుకే వారికి ఈరోజు ఈ దరిద్రపు గతి పట్టింది. నేను మోసపోయి వస్తే ఓదార్చాల్సింది పోయి ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలని కాపాడే ప్రయత్నం చేశారు.

నాకు కోట్ల రూపాయలు ఇవ్వాలని శివాజీరాజా అతడ్ని తొత్తులు ప్రయత్నం చేస్తే.. నేను తీసుకోలేదు. కడుపు మంది నా విషయంలో శివాజీరాజా ప్రవర్తన బాధాకరం. ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్ళు. సెటిల్మెంట్స్ చేసే గూండాలు. అందరూ తోడుదొంగలే.. ఆ డబ్బంతా పంచుకొని తిన్నారు. ఆ మొత్తంలో ఓ బడా హీరో వాటా చాల పెద్ద మొత్తం. అమెరికాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది'' అంటూ వెల్లడించింది. 

ఇవి కూడా చదవండి..

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

చిరంజీవి నాతో అలా చెప్పారు.. 'మా' వివాదంపై నరేష్!

కోటి రూపాయలతోనే అనుమానం.. శివాజీరాజాపై నరేష్ అసహనం!