Asianet News TeluguAsianet News Telugu

కోటి రూపాయలతోనే అనుమానం.. శివాజీరాజాపై నరేష్ అసహనం!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు శివాజీరాజా అసోసియేషన్ సొమ్ముని దుర్వినియోగం చేశారని.. తన సొంత వ్యాపకాల కోసం ప్రజల డబ్బుని వాడుకున్నారని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనం ప్రచురించింది. 

maa association general secretary naresh on maa controversy
Author
Hyderabad, First Published Sep 3, 2018, 8:10 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు శివాజీరాజా అసోసియేషన్ సొమ్ముని దుర్వినియోగం చేశారని.. తన సొంత వ్యాపకాల కోసం ప్రజల డబ్బుని వాడుకున్నారని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనం ప్రచురించింది. అయితే దీనిపై స్పందించిన శివాజీరాజా తను మోసం చేశానని నిరూపిస్తే.. గుండు చేయించుకుంటానని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరేష్ తాజాగా ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కొన్ని నిజాలను వెల్లడించారు.

''సిల్వర్ జూబ్లీ వేడుకలు మొదలైనప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని సంప్రదించాం. దానికి ఆయన ఎంతో సపోర్ట్ చేసి మొదటి ప్రోగ్రాం నేనే చేస్తానని అన్నారు. వారిని నా వందనాలు.  మొదటి  ప్రోగ్రాం ప్రారంభం నాటికి నేను పని చేయడానికి వెళ్లగా శివాజీరాజా కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లడం నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయనకి అనుభవముందని చేయనివ్వండని అన్నాను. చిరు ప్రోగ్రాం కనీసం ముగ్గురు దగ్గర నుండి కొటేషన్ తీసుకొని బెస్ట్ ఫైనల్ చేయాలని అన్నాను కానీ నన్ను సంప్రదించలేదు.

చిరంజీవి గారు వేడుకల్లో పాల్గొంటే 2 కోట్లు ఇస్తామని అన్నారు. ఒక ప్రోగ్రాం చేసినందుకు కోటి రూపాయలు అని చెప్పారు.  కోటి రూపాయలను సైన్ పెట్టడం వరకే మాకు తెలుసు. అప్పుడే నాకు సందేహం కలిగింది కానీ మధ్యలో అడ్డం వచ్చినట్లు ఉంటుందని మేము కూడా సపోర్ట్ చేశాం. చిరంజీవి తో పాటు ఎవరు వెళ్తున్నారని విషయం మాకు ఎవరికీ తెలియదు. అందరం ఒక్కటే కానీ ప్రజల డబ్బు కాబట్టి నేను మాట్లాడుతున్నాను'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

చిరంజీవి నాతో అలా చెప్పారు.. 'మా' వివాదంపై నరేష్!

మెగాఫ్యామిలీలో చిన్నికృష్ణ, గోపికలు!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట విషాదం!

కాళ్లకు చెప్పులు కూడా లేని రోజుల్లో ప్రేమించా.. గీతగోవిందం డైరెక్టర్ రియల్ లవ్ స్టోరీ!

Follow Us:
Download App:
  • android
  • ios