'మా' అసోసియేషన్ లో సిల్వర్ జూబ్లీ వేడుకల ద్వారా వచ్చిన సొమ్ముని తమ వ్యక్తిగత ఖాతాల్లో మళ్లించుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు మా అధ్యక్షుడు శివాజీరాజా. 'మా' కి సంబంధించిన కార్యకలాపాల్లో తనకు ఇన్వాల్వ్ చేయకుండా కొందరి సహకారంతో ట్రాన్స్పరన్సీ లేకుండా శివాజీరాజా వ్యవహరించారని జెనరల్ సెక్రటరీ నరేష్ ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చారు.

ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకొనే రైట్స్ తనకు ఉన్నప్పటికీ  శివాజీరాజా మీద ఉన్న నమ్మకంతో ఊరుకున్నానని కానీ ఇప్పుడు ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని మాట్లాడాల్సి వస్తుందని నరేష్ అన్నారు.  ''నేను ధర్మం కోసం పోరాడతాను. నాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది.'మా'లో  అందరం ఒక్కటే కానీ ప్రజల డబ్బు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు రావడం లేదు. ఒక ప్రెసిడెంట్ ఈవిధంగా కమ్యూనికేషన్ కట్ చేసి ఫారెన్ ప్రోగ్రాం సమయంలో వారికి కావాల్సిన వాళ్లను తీసుకొని వెళ్లడం ఎంతవరకు కరెక్ట్.

అందరూ బిజినెస్ క్లాస్ లో ప్రయాణించారు. ఒక్కో టికెట్ మూడు లక్షల రూపాయలు. ఆ డబ్బు ఎవరిది..? అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. క్రికెట్ మ్యాచ్ జరిగింది దాని ద్వారా కూడా ఏం వచ్చిందో నాకు తెలియదు. ఈ విషయంపై ఇటీవల చిరంజీవి గారిని కలిసినప్పుడు మాట్లాడాను. దానికి ఆయన కొంచెం టైమ్ ఇవ్వండి.. పెద్దలంతా కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నిజ నిర్ధారణ కమిటీ వేయాలనే నా ఆలోచన మంచి ఆలోచన అని పెద్దలంతా చెప్పారు'' అంటూ వెల్లడించారు. 

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

కోటి రూపాయలతోనే అనుమానం.. శివాజీరాజాపై నరేష్ అసహనం!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట విషాదం!

కాళ్లకు చెప్పులు కూడా లేని రోజుల్లో ప్రేమించా.. గీతగోవిందం డైరెక్టర్ రియల్ లవ్ స్టోరీ!