మూవీ ఆర్టిస్ట్ అసోసిసియేషన్(మా) రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. ఓ  ప్రముఖ ఆంగ్ల పత్రికలో 'మా' అసోసియేషన్ కొన్ని రికార్డులు మిస్ అయ్యాయని, సిల్వర్ జూబ్లీ ద్వారా వచ్చిన డబ్బుని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారంటూ ఓ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన 'మా' అధ్యక్షుడు శివాజీరాజా తాను నేరం చేశానని నిరూపిస్తే గుండు చేయించుకుంటానని కొన్ని వ్యాఖ్యలు చేశారు.

అయితే ప్రధాన కార్యదర్శి నరేష్ మాత్రం శివాజీరాజాకి వ్యతిరేకంగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో చిరంజీవితో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రూ.2 కోట్లు వస్తాయని చెప్పి ఆ తరువాత కోటి రూపాయలు మాత్రం వచ్చాయని చూపించారని.. అదే ప్రోగ్రాం ఇండియాలో పెట్టి ఉంటే ఐదు కోట్లు అంతకంటే ఎక్కువ ఫండ్స్ వచ్చి ఉండేవని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో రెండు వర్గాలు చిరంజీవి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సోమవారం ఉదయం శివాజీరాజా, శ్రీకాంత్ ప్రెస్ మీట్ లో చిరంజీవితో చర్చించిన తరువాత మీడియా ముందుకొచ్చామని అన్నారు. అంటే మెగాస్టార్ మద్దతు తీసుకొనే నరేష్ పై వ్యాఖ్యలు చేశారా అనుకుంటే.. మరోపక్క నరేష్.. చిరంజీవిని కలిసి విషయాలను చర్చించామని ఆయన దీనిపై పెద్దలతో కలిసి ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నట్లు నరేష్ తెలిపారు.

అయితే చిరంజీవి మద్దతు మాత్రం శివాజీరాజా వర్గానికే అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నటి శ్రీరెడ్డి కూడా పరోక్షంగా ఈ విషయంలో చిరుపై కామెంట్స్ వేసింది. మరి చిరంజీవి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి నిజాలు తెలుసుకుంటారో లేక ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటారో చూడాలి! 

ఇవి కూడా చదవండి..

ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్లు.. 'మా' వివాదంపై శ్రీరెడ్డి కామెంట్స్!

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

చిరంజీవి నాతో అలా చెప్పారు.. 'మా' వివాదంపై నరేష్!

కోటి రూపాయలతోనే అనుమానం.. శివాజీరాజాపై నరేష్ అసహనం!