సిల్వర్ జూబ్లీ వేడుకల్లో 'మా' అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని 'మా' అధ్యక్షుడు శివాజీరాజా ఖండించగా.. ప్రధాన కార్యదర్శి నరేష్ మీడియా ముందుకు వచ్చి నిజాలను వెల్లడించే ప్రయత్నం చేశారు. ఆధారాలతో సహా ఆయన కొన్ని విషయాలను స్పష్టం చేశారు. ''సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నన్ను ఇన్వాల్వ్ చేయలేదు.

చిరంజీవి గారు వెళ్లినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక రెండో టూర్ మహేష్ తో చేయించాలనే ప్రతిపాదన నేను తీసుకురాగా అందరూ అంగీకరించారు. నమ్రతతో ముందుగా మీటింగ్ ఎరేంజ్ చేశాను. దానికి శివాజీరాజా రాకుండా బెనర్జీని పంపించారు. ఫైనల్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా బెనర్జీని తీసుకెళ్లాం. నరేష్ గారు ఉంటే మాకు ఎలాంటి సమస్య లేదని నమ్రత చెప్పారు. ఆ సమయంలో బెనర్జీ ఆమె నంబర్ అడిగారు.

అప్పుడు ఆమె నావైపు చూడగా ఇవ్వమని చెప్పాను.  ఆ తరువాత నుండి ఆమెతో డైరెక్ట్ గా డీల్ చేశారు. నమ్రత నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్పగా.. మీకు నచ్చితే ప్రోగ్రాం చేసుకోండమ్మా అని చెప్పేసి ఊరుకున్నా.  రెండో ప్రోగ్రాంకి నేను ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేక మహేష్ టూర్ కి కూడా నేను వెళ్లలేదు. మా అసోసియేషన్ ని నేను అమ్మగా చూస్తాను. మా అమ్మగారు విజయ్ నిర్మల ప్రతి ఏడాది విరాళం ఇస్తారు.పుట్టినరోజు నాడు డెబ్భై వేలు, ఎనభై వేలు ఇలా ఇప్పటివరకు రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అటువంటి అసోసియేషన్ లో అవకతవకలు జరగడం నాకు బాధను కలిగిస్తుంది.

ఎలెక్షన్స్ కోసం ఇదంతా చేస్తున్నామని అంటున్నారు. దానికి ఇంకా సమయం ఉంది. ఎలెక్షన్స్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఎవరంటే 'మా'కి గౌరవం దక్కుతుందో..  ఎవరంటే 'మా'కి ఇటువంటి సమస్యలు ఎదురుకావో వారే ఉంటారు. గుండు చేయించుకుంటానని, రాజీనామా చేస్తానని నేను హంగామా చేయడం లేదు. నేను ఉన్నన్ని రోజు 'మా'కి అన్యాయం జరగనివ్వను. ఎలాంటి అన్యాయం చేయని నన్ను ఇమేజ్ పరంగా నరికేయాలనుకోవడం కరెక్ట్ కాదు'' అంటూ చెప్పుకొచ్చారు. 

చిరంజీవి నాతో అలా చెప్పారు.. 'మా' వివాదంపై నరేష్!

కోటి రూపాయలతోనే అనుమానం.. శివాజీరాజాపై నరేష్ అసహనం!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట విషాదం!

కాళ్లకు చెప్పులు కూడా లేని రోజుల్లో ప్రేమించా.. గీతగోవిందం డైరెక్టర్ రియల్ లవ్ స్టోరీ!