మహేష్ బాబు  కేవలం సినిమాల్లోనే  ..యాడ్స్ ప్రపంచంలోనూ ఆయనే సూపర్ స్టార్. మహేష్ బాబు చేస్తున్న మాదిరిగా తెలుగులో మరో ఏ హీరోకు అన్ని బ్రాండ్స్ లేవు. దేశంలోనే అతి పెద్ద బ్రాండ్లకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వస్తున్నారు.  తాజాగా మరో యాడ్ చేసేందుకు మహేష్ డీల్ కుదుర్చుకున్నాడు. ప్రముఖ సెకండ్ హ్యాండ్ కార్ల ఆన్‌లైన్ సంస్థ ‘కార్ దేఖో’ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు మహేష్ ఓకే అన్నాడు.ఈ కంపెనీని ప్రమోట్ చేసేందుకు ఆయనకు భారీ మొత్తంలో చెల్లించేందుకు సదరు కంపెనీదారులు ఒప్పందం చేసుకున్నారు.

ఇప్పటికే 21 కంపెనీలను ప్రమోట్ చేస్తున్న మహేష్ తాజాగా ఈ కార్ల సంస్థను కూడా ప్రమోట్ చయనుండటంతో ఆయన ఖాతా 22కు చేరింది. ఇదిలా ఉంటే త్వరలో మహేష్ తన సొంత బ్రాండ్ ఫెరఫ్యూమ్ ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇప్పటికే సొంత బ్రాండ్ బట్టలు మార్కెట్లో కు తెచ్చిన ఆయన ఫెరఫ్యూమ్ లాంచింగ్ తో నెక్ట్స్ లెవిల్ కు వెళ్తాడంటున్నారు. మహేష్ మ్యాజిక్ అని దానికి పేరు పెట్టే అవకాసం ఉందంటున్నారు. నమ్రత పూర్తిగా ఈ వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ప్లాన్ చేస్తోంది. నమ్రత ఓకే చేసినవి..మహేష్ చేసుకుంటూ పోవటమే.
 
సినిమాల విషయానికి వస్తే...‘గీత గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పరుశురామ్ తో తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.  వంశీ పైడిపల్లితో సినిమాను క్యాన్సిల్ చేసుకున్న మహేష్.. పరుశురామ్ కథకు ఓకే చెప్పాడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ఇప్పటికే పరుశురామ్ మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు.