Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బాబు,త్రిషకు సీరియస్ గా సీన్ వివరిస్తున్న త్రివిక్రమ్, వైరల్ అవుతున్న త్రోబ్యాక్ పిక్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు జీవితంలో మర్చిపోలేని సినిమా అతడు. ఈ సినిమా ఎంతలా ఫ్యాన్స్ ను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 17 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన ఈసినిమా.. ఇప్పటికీ టీవిలో వస్తే.. వదలకుండా చూస్తారు ఆడియన్స్. ఇక ఈసినిమాలో నటించిన మహేష్, త్రిషతో పాటు.. డైరెక్టర్ త్రివిక్రమ్ లో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అది శారీరకంగా కాని.. ఆటీడ్యూడ్ పరంగా కాని.. అంతా గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. 

Mahesh Babu and Trisha with Trivikram Athadu throwback Pic Viral
Author
Hyderabad, First Published Aug 4, 2022, 9:06 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు జీవితంలో మర్చిపోలేని సినిమా అతడు. ఈ సినిమా ఎంతలా ఫ్యాన్స్ ను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 17 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన ఈసినిమా.. ఇప్పటికీ టీవిలో వస్తే.. వదలకుండా చూస్తారు ఆడియన్స్. ఇక ఈసినిమాలో నటించిన మహేష్, త్రిషతో పాటు.. డైరెక్టర్ త్రివిక్రమ్ లో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అది శారీరకంగా కాని.. ఆటీడ్యూడ్ పరంగా కాని.. అంతా గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. 

 అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన సినిమా  అత‌డు. చాలా కాలం త‌ర్వాత ఈ సూపర్ డూపర్  సినిమా లొకేష‌న్ లో తీసిన త్రోబ్యాక్ స్టిల్ ఒక‌టి నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త్రివిక్ర‌మ్ చాలా ఇంట్రెస్టింగ్ గా.. ఓ సీన్ ను మహేష్ బాబుతో పాటు హీరోయిన్ త్రిష కు  వివ‌రిస్తున్న ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలో గుర్తు పట్టలేనట్టు ఉన్నారు. త్రివిక్రమ్ కాస్త బొద్దగా కనిపిస్తుండగా.. మహేష్, త్రిష కాస్త డిఫరెంట్ గా ఉన్నారు. మహేష్ బాబు అయితే.. ఇప్పటి లుక్ కు అప్పటి లుక్ కు అసలు పొంతన లేకుండా ఉన్నాడు. 

త్రివిక్ర‌మ్‌-మ‌హేశ్ బాబు  కాంబినేష‌న్ అన‌గానే  వెంటనే  అత‌డు సినిమా గుర్తకు వస్తుంది.  కామ్‌గా కూల్‌గా స్టైలిష్ లుక్ లో మహేష్ తన నటనతో  అద‌ర‌గొట్టేశాడు. తమిళ బ్యూటీ త్రిష  హీరోయిన్‌గా న‌టించి మెప్పించింది. గ్లామర్ లో కూడా వందకు వంద మార్కులు సాధించింది. ఇక  సిల్వ‌ర్ స్క్రీన్‌పై రిపీటెడ్‌గా ఎన్ని సార్లు చూసినా బోర్‌ కొట్టని సినిమాల్లో  అత‌డు తప్పకుండా ఉంటుంది. 

అతడు తరువాత వీరి కాంబోలో ఖలేజా సినిమా వచ్చింది. కాని ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేక పోయింది. మహేష్ అభిమానులను, ఆడియన్స్ ను మాత్రం అలరించింది మూవీ. ఇక ప్ర‌స్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు త్రివిక్ర‌మ్‌. ఈ నెల‌లో షూటింగ్  స్టార్ట్ కాబోతోంది.  ఈ ఇద్ద‌రు మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై మ్యాజిక్ రిపిట్ చేస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios