MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Avika Gor: కెమెరా ముందే వాంతి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. అస‌లేం జ‌రిగిందంటే.?

Avika Gor: కెమెరా ముందే వాంతి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. అస‌లేం జ‌రిగిందంటే.?

Avika Gor: చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకున్న అవికా గోర్ ఆ త‌ర్వాత హీరోయిన్‌గా కూడా మెప్పించారు. సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అవికా తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 05 2026, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైరల్ వీడియోతో మొదలైన కొత్త రూమర్స్
Image Credit : viralbhayani/Instagram

వైరల్ వీడియోతో మొదలైన కొత్త రూమర్స్

తాజాగా అవికా గోర్‌కి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోలో అవికా గోర్ తన భర్త మిలింద్ చంద్రవాణితో కలిసి ఓ ఈవెంట్‌ను నుంచి బయటకు వ‌స్తున్నారు. అదే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ఫొటోగ్రాఫ‌ర్లు ఈ జంట‌ను త‌మ కెమెరాల్లో బందిస్తున్నారు. అయితే కాసేపు న‌వ్వుతూ క‌నిపించిన అవికా మొహం ఒక్క‌సారిగా మారిపోయింది. క‌డుపును ప‌ట్టుకుని ప‌క్క‌కు వెళ్లి వాంతి చేస్తున్నట్లుగా కనిపించింది. ఆ సమయంలో మిలింద్ ఫొటోగ్రాఫ‌ర్ల‌ను ఫొటోలు తీయొద్దంటూ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ చిన్న సంఘటననే చూసి చాలా మంది అభిమానులు అవికా గర్భవతి అయ్యి ఉండొచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ప్రారంభించారు.

25
నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు
Image Credit : viralbhayani/instgram

నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు

ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నెటిజన్ల స్పందన రెండు విధాలుగా కనిపించింది. కొంతమంది అభిమానులు “ఇది గుడ్ న్యూస్ అయి ఉండొచ్చు” అని భావించారు. అయితే మరికొందరు మాత్రం ఇది నిజం కాదని, కేవలం నటన మాత్రమేనని వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లు “ఇది పబ్లిసిటీ కోసం చేసిన ప్రాంక్ అయి ఉండొచ్చు” అని కూడా కామెంట్స్ చేశారు. మ‌రికొంద‌రు “ఇది నిజమైన సంఘటనలా అనిపించడం లేదు” అంటూ వీడియోపై వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Related Articles

Related image1
Allu Arjun: సీనియర్ నటుడిపై చేయి చేసుకున్న అల్లు అర్జున్.. తప్పు తెలుసుకున్న వెంటనే
Related image2
గాజు, ప్లాస్టిక్ బాటిళ్ల‌పై ఉన్న స్టిక్క‌ర్ల‌ను ఎలా తొల‌గించాలి.? ఈ సింపుల్ ట్రిక్‌తో నీట్‌గా వ‌చ్చేస్తుంది
35
రియాలిటీ షోలో అవికా వివాహం
Image Credit : instagram

రియాలిటీ షోలో అవికా వివాహం

అవికా గోర్ తన స్నేహితుడు మిలింద్ చంద్వానీని 2025 సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ పెళ్లి ఒక రియాలిటీ షోలో జరిగింది. పతి ప‌త్ని ఔర్ పంగా అనే రియాలిటీ షోలో ఈ జంట పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెద్దగా చర్చకు దారితీసింది. అందుకే ఇప్పుడు వైరల్ అయిన ఈ వీడియో కూడా ఏదైనా ప్రాజెక్ట్ లేదా ప్రాంక్ కోసం కావొచ్చని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

45
గ‌తంలోనూ ప్రెగ్నెన్సీ వార్త‌లు
Image Credit : Instagram

గ‌తంలోనూ ప్రెగ్నెన్సీ వార్త‌లు

అయితే అవికా ప్రెగ్నెంట్ అంటూ వార్త‌లు రావ‌డం ఇదే తొలిసారి కాదు. 2026 జనవరిలో కూడా అవికా గోర్ గర్భవతి అన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. ఆ సమయంలో అవికా ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. “ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. అలాంటిదేమీ లేదు” అని ఆమె స్పష్టం చేశారు.

55
అస‌లేం జ‌రిగింది.?
Image Credit : Social Media

అస‌లేం జ‌రిగింది.?

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై అవికా గోర్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అందువల్ల ఇది నిజంగా గర్భధారణకు సంబంధించిన విషయం కాదా, లేక సాధారణ సంఘటననా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అవికా నిజంగానే గ‌ర్భందాల్చారా.? లేదా అనారోగ్య కార‌ణంతో వాంతి చేసుకున్నారా.? లేదా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తున్న‌ట్లు ఇది ప్రాంక్ వీడియోనా క్లారిటీ రావాలంటే అవికా అధికారికంగా స్పందించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu మార్చి 5 ఎపిసోడ్: వార్నింగ్ ఇచ్చి మరీ భాగ్యాన్ని పంపేసిన నర్మద, ఇకపై సాగర్‌కు ఇత్తడే
Recommended image2
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Related Stories
Recommended image1
Allu Arjun: సీనియర్ నటుడిపై చేయి చేసుకున్న అల్లు అర్జున్.. తప్పు తెలుసుకున్న వెంటనే
Recommended image2
గాజు, ప్లాస్టిక్ బాటిళ్ల‌పై ఉన్న స్టిక్క‌ర్ల‌ను ఎలా తొల‌గించాలి.? ఈ సింపుల్ ట్రిక్‌తో నీట్‌గా వ‌చ్చేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved