తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన అన్నయ్య సత్యనారాయణరావు భార్య కళావతి(72) అనారోగ్యం కారణంగా మరణించారు. గత కొంతకాలంగా ఆమె కిడ్నీ, షుగర్ సమస్యలతో బాధ పడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బెంగుళూరులోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11 గంటలను ఆమె కన్నుమూశారు.

కుటుంబ సభ్యుల సందర్శనార్ధం బెంగుళూరులోని సత్యనారాయణ నివాసంలో కళావతి భౌతిక ఖాయాన్ని ఉంచారు. తన వదినను చూడడానికి రజినీకాంత్ సోమవారం ఉదయమే బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయన కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షెడ్యూల్ కోసం చిత్రబృందం లడఖ్ వెళ్లాల్సివుంది. కానీ ఇంతలోనే రజినీకాంత్ వదిన చనిపోవడంతో ఆయన వదిన అంత్యక్రియల కోసం బెంగుళూరుకి వెళ్లారు.

అవి పూర్తయిన తరువాత తిరిగి షూటింగ్ లో పాల్గొంటారు. తను నటుడిగా ప్రయ్నతాలు మొదలుపెట్టిన సమయంలో తన అన్న, వదిన ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని గతంలో రజినీకాంత్ వెల్లడించారు. 

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

చిరంజీవి నాతో అలా చెప్పారు.. 'మా' వివాదంపై నరేష్!

కోటి రూపాయలతోనే అనుమానం.. శివాజీరాజాపై నరేష్ అసహనం!

కాళ్లకు చెప్పులు కూడా లేని రోజుల్లో ప్రేమించా.. గీతగోవిందం డైరెక్టర్ రియల్ లవ్ స్టోరీ!