దక్షిణాదిన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ‘కాంచన’ సినిమాను బాలీవుడ్‌ రీమేక్ నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డైరక్ట్ ఓటీటిలో రిలీజైంది. అయితే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారు బాగోలేదని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం,రివ్యూలు నెగిటివ్ గానే రావటం జరిగింది. అయితే అంత పూర్ టాక్ వచ్చినా రికార్డ్ వ్యూస్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే నే రికార్డ్ బ్రేక్ చేసినట్లు బాలీవుడ్ మీడియా చెప్తోంది. 

హాట్ స్టార్ లెక్కల ప్రకారం..ఈ హారర్ కామెడీ సినిమా సుశాంత్ సింగ్ రాజపుత్ లాస్ట్ సినిమా దిల్ బేచారా వ్యూస్ ని దాటేసింది. డిస్నీ,హాట్ స్టార్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపినింగ్ మూవిగా చెప్తున్నారు. కేవలం 12 గంటల్లోనే కళ్లు చెదిరే రికార్డ్ వ్యూస్ సాధించినట్లు చెప్తున్నారు. ఐపీఎల్ సీజన్ తో హాట్ స్టార్ కు భారీగా సబ్ స్కైబర్స్ పెరిగారు. దాంతో లక్ష్మి సినిమా 200 మిలియన్ వ్యూస్ కేవలం ఇరవై నాలుగు గంటల్లో సాధించారని చెప్తున్నారు. అదే దిల్ బేచారా సినిమా మొదటి రోజు 95 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. ఇదే టిక్కెట్ల రూపంలో లెక్క వేస్తే కనుక వెయ్యి కోట్లు దాకా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ చెప్తోంది.

ఈ లెక్కలతో హాట్ స్టార్ డిస్నీ నిర్వాహకులకు టెన్షన్ పోయిందిట. ఎందుకంటే ఇప్పటికే ఈ సీజన్‌లో వాళ్లు తీసుకున్న సడక్ 2 డిజాస్టర్ అయింది. దాంతో పాటు లూట్ కేస్ లాంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా డిజాస్టర్ అవ్వటంతో చాలా టెన్షన్ గా ఉన్నారట. ఒక్క సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దిల్ బెచారా మాత్రమే హిట్ అయింది.  ఈ నేపధ్యంలో భారీ అంచనాలు.. ఆశలతో లక్ష్మీ సినిమాను దాదాపు 140 కోట్లకు తీసుకుంది హాట్ స్టార్. ఇప్పుడు ఈ చిత్రానికి వస్తున్న టాక్ చూస్తుంటే వాళ్లు ఫుల్ ఖుషీగా ఉన్నారట. మరి ఈ టాక్‌తో అక్షయ్ కుమార్ ఇంకే స్దాయి మ్యాజిక్ చేస్తాడో చూడాలి అంటోంది ట్రేడ్.