మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న తెలుగు, హిందీతో పాటు సౌత్ ఇండియన్ భాషలన్నిటిలో గ్రాండ్ గా రిలీజవుతోంది. మంగళవారం రిలీజ్ చేసిన సైరా టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ప్రచారం కోసం సైరా యూనిట్ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఈ మీడియా సమావేశంలో కన్నడ స్టార్ హీరో సుదీప్ మాట్లాడారు. సుదీప్ ఏ చిత్రంలో 'అవుకు రాజు'గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. సైరాలో చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్స్ తో నటిస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ చిత్రం దబాంగ్ లో కూడా నటిస్తున్నారు. ఇలా స్టార్ హీరోల చిత్రాల్లో అద్భుతమైన పాత్రల చేయడం గురించి మాట్లాడమని ఓ మీడియా ప్రతినిధి కోరాడు. 

ఇది చాలా అద్భుతమైన ఫీలింగ్. సైరా చిత్రానికి బడ్జెట్ ఎంతో.. అంతే విలువైన నటీనటులు ఈ చిత్రంలో నటించారు. నా లాగే రాంచరణ్ కూడా ఓ నటుడు. కానీ తన తండ్రి కోసం నిర్మాతగా మారాడు. ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు అని సుదీప్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రంలో నటించిన వారందరికీ ఎవరి స్థాయిలో వారికీ క్రేజ్ ఉంది. మేమంతా ఈ చిత్రం కోసం ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం అని సుదీప్ తెలిపాడు. 

ఇక దబాంగ్ 3 గురించి మాట్లాడుతూ అన్ని భాషల్లో నటించడం నటుడిగా నాకు సంతోషాన్నిచ్చే విషయం అని సుదీప్ తెలిపాడు. 

ముంబైలో అట్రాక్షన్ గా మారిన చిరు, చరణ్, తమన్నా(ఫొటోస్)

ముంబై మీడియా కోరిక.. కూల్ గా ఆన్సర్ ఇచ్చిన రాంచరణ్!

వైరల్ పిక్: మెగాస్టార్ - రామ్ చరణ్ లతో ప్రభాస్

బాసు.. 30 ఏళ్ల నుంచి.. సైరా టీజర్ పై సెలెబ్రిటీస్ రెస్పాన్స్!

ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా చేయాలనుకున్నా: చిరు!

సైరా టీజర్: చరిత్రను మొదలుపెట్టిన తెలుగు సింహం