టీజర్ తో ఒక్కసారిగా సినిమా క్రేజ్ ని ఊహించని స్థాయికి తీసుకెళ్లింది సైరా టీమ్. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, అలాగే తమిళ్ హిందీ భాషల్లో కూడా భాషకు సంబందించిన ప్రముఖ తారల వాయిస్ ఓవర్ తో సినిమా టీజర్ పై అంచనాలను రేపింది. ఇక సైరా టీజర్ కి సంబందించిన స్క్రీన్ షాట్స్ తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. 

అయితే ఎవరు ఊహించని విధంగా మెగాస్టార్ తో సాహో ప్రభాస్ కూడా కనిపించాడు. బాలీవుడ్ మీడియా ముందు సైరా సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన అనంతరం ప్రభాస్ రామ్ చరణ్ ను ప్రత్యేకంగా కలిశాడు. అలాగే మెగాస్టార్ ను కూడా కలిసి ఇద్దరితో ఒక ఫొటోకు పోజిచ్చాడు. అందుకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

యూవీ క్రియేషన్స్ నిర్మించిన సాహో సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన సైరా సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.