మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి 6 పదుల వయసులో ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి చేశారు. 

కొద్దిసేపటి క్రితమే విడుదలైన టీజర్ కు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. గ్రాండ్ విజువల్స్, మెగాస్టార్ కళ్ళు చెదిరే యాక్షన్ స్టంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా సైరా టీజర్ పై టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. 

డైరెక్టర్ మారుతి ట్విట్టర్ లో స్పందిస్తూ.. బాసు.. 30 ఏళ్ల నుంచి గూస్బంప్స్ ఇస్తూనే ఉన్నారు. ఈసారి ఇచ్చిన హై అదిరింది. సైరా టీజర్ మరో లెవల్ లో ఉంది. నిర్మాత రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డికి నా శుభాకాంక్షలు అని మారుతి స్పందించారు. 

సైరా టీజర్ అదిరింది. మెగాస్టార్ నుంచి మాస్టర్ పీస్ ఇది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సైరా చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెష్ అని రచయిత గోపి మోహన్ ట్వీట్ చేశారు. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టీజర్ విడుదల కాగానే ట్విట్టర్ లో స్పందించాడు. ఊహకందని అనుభవం.. అమేజింగ్ స్టఫ్.. సైరా విడుదల కోసం ఎదురుచూడలేకున్నా అని వరుణ్ కామెంట్ చేశాడు. 

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. 'చరిత్ర మిమ్మల్ని ఎప్పటికి మరచిపోలేదు మెగాస్టార్ చిరంజీవి' అని కామెంట్ చేశాడు. 

ఖైదీ నెం 150లో చిందేసిన 'రత్తాలు' రాయ్ లక్ష్మి కూడా సైరా టీజర్ పై తన స్పందన తెలియజేసింది. ' ఓ మై గాడ్ ఇది నిజామా.. నేను చూసిన దాన్ని మాటల్లో వర్ణించలేను. చిరంజీవి సర్.. నాకు మాటల్లేవు.. మీరు ఊహకందని వారు. బిగ్ సెల్యూట్. సైరా చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు' అని రాయ్ లక్ష్మి ట్వీట్ చేసింది. 

హీరో సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవిని, అమితాబ్ బచ్చన్ ని ఒకే స్క్రీన్ పై చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ చిత్రంతో ఆ కల నెరవేరబోతోంది. సైరా టీజర్ అద్భుతంగా ఉంది అని సుధీర్ బాబు అన్నారు.