సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరక్కుతున్న సైరా అసలైన రూపం నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కోసం గత కొన్ని నెలలుగా మెగా అభిమానులనే కాకుండా చాలా మంది సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా రిలీజైన టీజర్ సినిమా లెవెల్ ని మరో స్థాయికి పెంచేసింది. 

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో జీవించాడని పిస్తోంది. పవన్ కళ్యాణ్ వాయిస్ అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా స్వాతంత్య్ర పోరాట గొంతును ఆవిష్కరిస్తోంది. 

"చరిత్ర స్మరించుకుంటోంది. ఝాన్సీ లక్ష్మి భాయ్ - చంద్ర శేఖర్ ఆజాద్ - భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యారు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ భేరి మ్రోగించిన రేనాటి సూర్యుడు" అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ టీజర్ కి ఎంతో బలాన్ని ఇచ్చింది.

ఇక మెగాస్టార్ సైరా పాత్రలో చెప్పిన డైలాగ్ కూడా ఎంతో ఆలోచింపజేస్తోంది. రేనాటి వీరుల్లారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర మనోతోనే మొదలవ్వాలి అని చెప్పిన మాటలు గుండెను తాకుతున్నాయి. ఇక చివరగా ఒక్కసారిగా సైరా వీరత్వాన్ని తెలిపేలా పవర్ స్టార్ సైరా నరసింహా రెడ్డి అని చెప్పిన డైలాగ్ , యాక్షన్ సీన్స్ అలాగే పాత్రలో ప్రతి లుక్ ఆడియెన్స్ లో ఉన్న అంచనాల డోస్ ని తారా స్థాయికి తీసుకెళ్లాయి. మరి సినిమా బిగ్ స్క్రీన్ పై ఇంకా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.