చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. హిందీ సినిమా టీజర్ లాంచ్ కోసం చిరు స్వయంగా ముంబైకి వెళ్లి మరీ సినిమాను ప్రమోట్ చేశారు. చిత్రబృందంతో పాటు చిరు, రామ్ చరణ్ స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈవెంట్ లో చరణ్ తన తండ్రి గురించి గొప్పగా మాట్లాడారు. 

అలానే చిరు మాట్లాడుతూ.. ''భారతీయులంతా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవాలి.. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా చేయాలనుకున్నాను కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా చేయలేకపోయాను. చివరకు రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిల కారణంగా ఈ సినిమా చేయగలిగా.. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి రావడం కరెక్ట్ అనిపించింది అందుకే మంచి కంటెంట్ తో హిందీ ఆడియన్స్ ని పలకరించాలని అనుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు.