Asianet News TeluguAsianet News Telugu

‘కార్తికేయ 2’ రిలీజ్ డేట్ వాయిదా.. ఎందుకు? మళ్లీ ఎప్పుడు?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తీకేయ 2’ (Karthikeya 2). తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ మేకర్స్ న్యూ డేట్ ను అనౌన్స్ చేశారు. 
 

Karthikeya 2 Movie release date postponed, Why? When again?
Author
Hyderabad, First Published Aug 3, 2022, 4:59 PM IST

హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) ఆడియెన్స్ ను ఫిదా చేయడమే లక్ష్యంగా విభిన్న కథాంశాల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో మైథలాజికల్ ఫిల్మ్ ‘కార్తికేయ’తో మంచి సక్సెస్ ను అందుకున్న విషయం  తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా ప్రస్తుతం ‘కార్తికేయ 2’ (Karthikeya 2)తో వస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, పాటలుకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

సినిమాపై మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్రమోషన్స్ ను చాలా డిఫరెంట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మూవీ రిలీజ్ డేట్ లోనూ మార్పులు చేశారు. సినిమాను ఒక్కరోజుకు వాయిదా వేస్తూ ఆగస్టు 12న విడుదల కావాల్సిన చిత్రాన్ని ఆగస్టు 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తాజాగా అధికారిక ప్రకటనలో వెల్లడించారు. అయితే సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని పరిశీలిస్తే.. ఆగస్టు 12నే నిఖిల్ కు పోటీగా మరో రెండు చిత్రాలు ఉన్నాయి.. అక్కినేని నటించిన  ‘ఏజెంట్’, సమంత నటించిన ‘యశోద’ చిత్ర యూనిట్స్ అదే రోజును రిలీజ్ డేట్ కింద బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. 

అయితే సమంత ‘యశోద’ రిలీజ్ కు ఇంకాస్త సమయం పడుతుందని తెలిసిపోతోంది. దీంతో నిఖిల్ ‘కార్తీకేయ 2’కు గట్టి పోటీగా అఖిల్ ‘ఏజెంట్’ చిత్రం నిలువనుంది. దీంతో ముందు జాగ్రత్తగా మేకర్స్ ఆలోచించి ఎలాంటి ఇబ్బందులు ఉండకూదనే ఒక్కరోజు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో సినిమా వాయిదా పడుతుందని వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. మేకర్స్ ఎట్టకేళలకు ఒక్క రోజు గ్యాప్ లోనే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 
 
ఇక చిత్రం ఆగస్టు 13న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. మూవీలో గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్, నిఖిల్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా..  చందూ మండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై చిత్రాన్ని నిర్మించారు. అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌  ఆయా పాత్రల్లో నటించారు. తెలుగులో రూపుదిద్దుకున్న ఈ చిత్రం హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ అవుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios