సోమవారం రాత్రి అలకాపురి టౌన్ షిప్ వద్ద సినీ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజ్ తరుణ్ క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో రాజ్ తరుణ్ పారిపోవడం సిసి టివిలో కనిపించింది. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన చాలా సమయం తర్వాత దీనిపై రాజ్ తరుణ్ స్పందించాడు. భయంతో పరిగెత్తానని వివరణ ఇచ్చాడు. 

నేడు ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కార్తీక్ అనే వ్యక్తి రాజ్ తరుణ్ ఆడియో, వీడియో క్లిప్ లని బయటపెట్టాడు. ఇందులో రాజ్ తరుణ్ మద్యం సేవించి ఉన్నాడని పేర్కొన్నాడు. పారిపోతున్న రాజ్ తరుణ్ ని పట్టుకోగా మద్యం సేవించి ఉన్నానని ఈ విషయం బయటకు తెలియకూడదని తనతో బేరసారాలు ఆడే ప్రయత్నం చేశారని కార్తీక్ ఆరోపించాడు. దీనివల్ల రాజ్ తరుణ్ కెరీర్ పాడైపోతుందని.. తనని 3 లక్షల డబ్బుతో ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని కార్తీక్ ఆరోపించాడు. 

తనతో బేరం కుదుర్చుకునేందు రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర, ఓ మహిళ కూడా రంగంలోకి దిగినట్లు కార్తీక్ తెలిపాడు. ఆడియో, వీడియోలు డిలీట్ చేయాలని బెదిరించినట్లు కూడా కార్తీక్ ఆరోపించాడు. దీనిపై ఓ మీడియా సంస్థ లో రాజా రవీంద్ర, కార్తీక్ మధ్య వాదన జరిగింది. అతను ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు అతనికి నేనెలా ఫోన్ చేస్తాను. అతడే నాకు కాల్ చేశాడని రాజారవీంద్ర తెలిపారు. 

కార్తీక్ రూ5 లక్షలు డిమాండ్ చేస్తూ రాజ్ తరుణ్ ని బ్లాక్ మెయిల్ చేసాడని ఆరోపించాడు. తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ రాజా రవీంద్ర కార్తీక్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశాడు. కార్తీక్ మొత్తం అవాస్తవాలు మాట్లాడుతున్నాడని, ఈ విషయంలో తాము న్యాయపరంగా ముందుకెళ్లనున్నట్లు రాజా రవీంద్ర పేర్కొన్నాడు. 

హీరో రాజ్ తరుణ్ కు భారీ షాక్: వీడియో సాక్ష్యాలను బయటపెట్టిన కార్తీక్

యాక్సిడెంట్ ఎఫెక్ట్: రాజ్ తరుణ్ పై కేసు నమోదు..!

తాగి డ్రైవ్ చేశావా..?' నెటిజన్ ప్రశ్నపై రాజ్ తరుణ్ రియాక్షన్!

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

రాజ్ తరుణ్ పారిపోవడంపై పోలీసుల అనుమానాలు ఇవే!

యాక్సిడెంట్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్