Asianet News TeluguAsianet News Telugu

Viruman:ప్రభాస్ సినిమా పాయింట్ లేపి, హిట్ కొట్టారు

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అదితి శంకర్ జంటగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరుమాన్. ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఈ సినిమాను కార్తీ అన్న హీరో సూర్య నిర్మించడం విశేషం

 Karthi Massive Blockbuster Viruman inspired from prabhas movie?
Author
Chennai, First Published Aug 18, 2022, 11:58 AM IST


 కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అదితి శంకర్ జంటగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరుమాన్. ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఈ సినిమాను కార్తీ అన్న హీరో సూర్య నిర్మించడం విశేషం. తమిళంలో మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్స్ రాబట్టడంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా చిత్ర బృందానికి కాస్ట్లీ గిఫ్ట్ ను అందించారు. 

తమిళంలో ఈ వారం పెద్దగా సినిమాలు ఏమీ రాలేదు. దీంతో వీరుమాన్ సినిమాకు భారీగా థియేటర్లు దొరికాయి. జనాలకు కూడా పక్కా తమిళ సినిమా చూసి చాలా రోజులైంది కాబట్టి ఓపెనింగ్స్ అయితే భారీ స్థాయిలోనే వచ్చాయి. ఒక విధంగా కార్తీ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇక దర్శకుడు ముత్తయ్య ఈ సినిమాను ఎలా తెరపైకి తీసుకువచ్చాడు అనే వివరాల్లోకి వెళ్తే కంప్లీట్ గా ఈ సినిమా తమిళ్ నేటివిటీకి తగ్గట్టుగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తలకెక్కించారు. కొత్తదనం ఏమీ లేదు గతంలో ప్రభాస్ వంశీ పైడిపల్లి కలయికలో వచ్చిన మున్నా లైన్ తీసుకుని దర్శకుడు ముత్తయ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చాడు.

 తల్లి మరణానికి కారణం అయినా తండ్రి పై కొడుకు తీసుకునే రివెంజ్. అలాగే అతన్ని మార్చే హీరోయిన్. ఇక హీరో విలన్స్ యాక్షన్స్.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ఎప్పటిలానే హైలెట్ చేశారు.  ఈ సినిమాకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ, ఓపెనింగ్ కలెక్షన్లు బాగున్నాయి. హీరోయిన్ గా చేసిన శంకర్ కూతురు నటనకు కూడా పెద్దగా మార్కులు పడలేదు. కాకపొతే, ఆమెకి ఇది సేఫ్ లాంచ్ అని చెప్పొచ్చు. సాధారణంగా కార్తీ నటించే ప్రతి తమిళ చిత్రం తెలుగులో డబ్బింగ్ అవుతుంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతుంది. కానీ “వీరుమాన్” అనే ఈ చిత్రం విషయంలో అలా జరగలేదు. మరి ఈ సినిమాను తెలుగులో ఓటీటీ లో అయినా విడుదల చేస్తారో లేదో చూడాలి.

సినిమా హిట్ అయితే ఆ సెలబ్రేషన్స్ ని కాస్టలీ గిప్ట్ లతో చేసుకోవటం ఇప్పుడు అంతటా ఆనవాయితీగా మారింది. రీసెంట్ గా కమల్ హాసన్ విక్రమ్ చిత్రం సూపర్ హిట్ అవగానే తన టీమ్ అందరికీ చాలా ఖరీదైన గిప్ట్ లతో సత్కరించారు.  దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు కారు కొని బహుమతిగా అందించారు. ఇక విక్రమ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిసిన స్టార్ హీరో సూర్యకు రోలెక్స్ వాచ్ ప్రజంట్ చేశారు కమల్. ఈ వార్తలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సూర్యకు మరో కాస్ట్లీ గిఫ్ట్ దొరకింది. ఆయనొకక్కడికే కాదు ఆయనతో పాటు… తమ్ముడు కార్తీకి కూడా ఈ గిఫ్ట్ అందింది.

తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తి వేలన్.. చిత్ర టీమ్  కు డైమండ్ బ్రాస్ లైట్స్ ను గిఫ్ట్ గా అందించాడు. డైరెక్టర్ ముత్తయ్య కు డైమండ్ రింగ్ ఇవ్వగా.. సూర్య, కార్తీలకు బ్రాస్ లైట్స్ ను ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  ఏదిఏమైనా థియేటర్లన్నీ కళకళలాడుతూ ప్రేక్షకులను మెప్పించడం కన్నా పెద్ద గిఫ్ట్ తమకు ఏది ఉండదని ఈ అన్నదమ్ములు చెప్పుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios