MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad Lok Sabha : మాధవీ లత మామూలు మహిళ కాదు... ఓవైసి కంటే ఎంత రిచ్చో తెలుసా?

Hyderabad Lok Sabha : మాధవీ లత మామూలు మహిళ కాదు... ఓవైసి కంటే ఎంత రిచ్చో తెలుసా?

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి... కానీ హైదరాబాద్ లోక్ సభ ఒక్కటి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అక్కడ దశాబ్దాలుగా పాతుకుపోయిన ఎంఐఎంపై ఈసారి బిజెపి ఓ ఆడబిడ్డను బరిలోకి దింపింది...

3 Min read
Author : Arun Kumar P
| Updated : May 01 2024, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Hyderabad

Hyderabad

హైదరాబాద్ : తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా హైదరాబాద్ లోక్ సభ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీచేయడానికే వెనకడుగు వేసే పాతబస్తీలో బిజెపి ఓ మహిళను పోటీలో దింపడం ఏమిటి? ఇంతకూ ఎవరా మహిళా? దశాబ్దాలుగా హైదరాబాద్ లోక్ సభలో మరో పార్టీకి చోటే లేదు...  ఓవైసి కుటుంబమే అక్కడ గెలుస్తూ వస్తోంది... మరి ఈసారి పరిస్థితి ఎలా వుంటుంది? చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో ప్రజాతీర్పు ఎలా వుండనుంది? అన్న ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి. అంతేకాదు బిజెపి అదిష్టానం హైదరాబాద్ లోక్ సభపై ఎందుకంత ఫోకస్ పెట్టింది? అక్కడ పోటీచేసే అభ్యర్థికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అన్నదానిపైనా చర్చ జరుగుతోంది. 

211
Hyderabad

Hyderabad

ఇలా హైదరాబాద్ లోక్ సభ వైపు యావత్ దేశం చూస్తోంది. దీంతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి, బిజెపి అభ్యర్థి మాధవీ లత బలాబలాలను పోల్చి చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు తమ నామినేషన్లను దాఖలు చేసారు... కాబట్టి వారి ఆస్తిపాస్తుల వివరాలు బయటకు వచ్చాయి. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతులు? ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి? ఎవరికి ఎక్కువ అప్పులున్నాయి?... ఇలాంటి వివరాలను తెలుసుకుందాం. 

311
Hyderabad

Hyderabad

ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసి : 

ముందుగా అసదుద్దీన్ ఓవైసి విషయానికి వస్తే ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తహాదుల్ ముస్లిమిన్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాయి. తండ్రి సలావుద్దీన్ ఓవైసి మరణానంతరం పార్టీ బాధ్యతలు స్వీకరించారు అసద్... అలాగే రెండు దశాబ్దాలుగా తండ్రి ఎంపీగా పనిచేసిన హైదరాబాద్ నుండి పోటీకి సిద్దమయ్యారు. ఇలా 2004లో హైదరాబాద్ ఎంపీగా గెలియిన అసదుద్దీన్ కూడా తండ్రిలాగే రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. 

411
Hyderabad

Hyderabad

ఇలా దశాబ్దాలుగా రాజకీయాల్లో వున్నా అసదుద్దీన్ ఆస్తిపాస్తులు చాలా తక్కువగానే వున్నట్లు ఈసికి సమర్పించిన నామినేషన్ వివరాలను బట్టి తెలుస్తోంది. తన కుటుంబానికి కేవలం రూ.23.87 కోట్ల విలువైన ఆస్తులు వున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. 

511
Hyderabad

Hyderabad

నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం... అసదుద్దీన్ ఓవైసి చరాస్తుల విలువ రూ.2.96 కోట్లుగా వుంది. ఆయన భార్య పేరుపై రూ.15.71 లక్షల విలువైన ఆస్తులు వున్నాయి.  ఓవైసి భార్య పేరిట రూ.4.90 కోట్ల స్థిరాస్తులు  వున్నాయి. శాస్రిపురంలో రూ.19.65 కోట్లు, మిస్రిగంజ్ లో రూ.96 కోట్ల విలువైన రెండు ఇళ్లు వున్నాయి. 

611
Hyderabad

Hyderabad

ఆసక్తికరమైన విషయం ఏమిటంటూ అసదుద్దీన్ ఓవైసికి సొంత కారు కూడా లేదట. వ్యవసాయ భూములు, వాణిజ్య భవనాలు... ఇలా తనకు ఎలాంటి ఆస్తులు లేవని ఓవైసి వెల్లడించారు.రూ.7 కోట్ల అప్పులు వున్నట్లు ఓవైసి తెలిపారు. 

711
Hyderabad

Hyderabad

ఇక రాజకీయ పార్టీ అధినేతగా వున్న అసదుద్దీన్ ఓవైసి రక్షణకోసం ఆయుధాలను కలిగివున్నట్లు తెలిపారు.  ఒక NP బోర్ 22 పిస్తల్,  మరో NP బోర్ 30-60 రైఫిల్ తనవద్ద వున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. 

811
Hyderabad

Hyderabad

బిజెపి అభ్యర్థి మాధవీ లత :

హైదరాబాద్  లోని ప్రముఖ హాస్పిటల్స్ లో 'విరించి' ఒకటి. ఈ హాస్పిటల్ యజమాని మాధవీ లత ఇప్పుడు హైదరాబాద్ బిజెపి అభ్యర్థి. ఇలా బిజెపిలో చేరిందో లేదో అలా లోక్ సభ సీటు పట్టేసింది మాధవీ లత. ఆమె స్థిర చరాస్తుల విలువ ఏకంగా రూ.218 కోట్లు. 

911
Hyderabad

Hyderabad

మాధవీలత కుటుంబ చరాస్తుల విలువ రూ. 165.46 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ. 55.92 కోట్లుగా వెల్లడించారు.  అదే సమయంలో మొత్తం రూ.27.03 కోట్ల మేర అప్పులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే.. విరించి లిమిటెడ్‌, వినో బయోటెక్‌లలో ఆమె పేరిట రూ.92 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్టు తెలిపారు.

1011
Hyderabad

Hyderabad

ఇక మాధవి లత భర్త కొంపెల్ల విశ్వనాథ్‌ పేరిట రూ.56.19 కోట్ల విలువైన షేర్లు, అలాగే.. అన్‌లిస్టెడ్‌ కంపెనీలైన గజ్వేల్‌ డెవలపర్స్‌, పీకేఐ సొల్యూషన్స్‌, విరా సిస్టమ్స్‌ల్లో  రూ.16.27 కోట్ల షేర్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు.

1111
Hyderabad

Hyderabad

ఆభరణాల విషయానికి వస్తే..  5 కిలోల బంగారం, ఇతర ఆభరణాలున్నట్లు పేర్కొన్నారు. ఇన్ని ఆస్తులున్నా.. వ్యవసాయ భూములు గానీ, వాహనాలు గానీ లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తనపై ఓ క్రిమినల్‌ కేసు కూడా ఉన్నట్లు మాధవీలత ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Recommended image2
Now Playing
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu
Recommended image3
Railway Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. పదో తరగతి అర్హతతో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు, తెలుగులోనే ఎగ్జామ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved