కన్నడ నటి సంయుక్త హెగ్డే, కాంగ్రెస్‌ నాయకురాలు కవితా రెడ్డి మధ్య ఇటీవల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పార్క్ లో స్పోర్ట్స్ డ్రెస్‌ దరించి సంయుక్త, ఆమె స్నేహితురాలు వ్యాయామం చేస్తుండగా అటుగా
వెళ్ళిన కాంగ్రెస్‌ నాయకురాలు కవితారెడ్డి వీడియో తీస్తూ మరీ దాడి చేశారు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేపింది. 

ఈ సందర్భంగా సంయుక్త హెగ్డే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. `మహిళలు ఏం ధరిస్తున్నారు.. ఎటువైపు వెళ్తున్నారు.. ఏం చేస్తున్నారనే
కారణాలతో హింసించడం సమాజం ఆపాలి` అని ట్వీట్‌ చేసింది. కవితా రెడ్డిపై కేసు పెట్టడంతో ఎట్టకేలకు కవిత దిగొచ్చింది. సంయుక్తకి క్షమాపణలు తెలిపింది. ఆ సమయంలో తాను అలా చేసి ఉండాల్సింది కాదని చెప్పింది. కవిత క్షమాపణలను సంయుక్త అంగీకరించింది. జరిగిదాన్ని మర్చిపోయి ముందుకు సాగాలని, ప్రతిచోట మహిళలకు భద్రత ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. 

ఇదిలా ఉంటే ఈ ఘటనపై సినీ తారలు స్పందించి ఖండిస్తున్నారు. స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ స్పందించి సంయుక్తకి సపోర్ట్ చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ పెట్టింది. `ఓ మై గాడ్‌.. సామ్‌ ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నా. మిస్‌ కవితా రెడ్డి.. మీ కోపానికి గల కారణాలు ఏంటో తెలుసుకుని పరిష్కరించుకోండి. ఈ దుందుడుకు స్వభావానికి, చిరాకుకు మూలం ఏంటో తెలుసుకోండి. అన్నింటికి మించి ఎలాంటి బట్టలు
వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసు.  సలహాలు ఇవ్వడం మానుకోండి. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది` అని ఘాటుగా స్పందించింది.