కోర్టు ఆదేశాలతో నిరాశలో స్టార్ హీరో!

Jodhpur court: Salman Khan Has To Seek Permission For Every Foreign Trip
Highlights

కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదంటూ రాజస్థాన్ జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు హెచ్చరికలు జారీ చేసింది

కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదంటూ రాజస్థాన్ జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ నిబంధన నుండి తనకు విముక్తి కల్పించమని తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు సల్మాన్. శనివారం విచారణకు వచ్చిన ఆ పిటిషన్ ను కొట్టిపారేసింది కోర్టు.

విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 10 నుండి 26 వ తేదీల మధ్య సల్మాన్ విదేశాల్లో పర్యటించాల్సివుందని పిటిషన్ లో పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి చేయడానికి అబుదాబి, మాల్టాలకు వెళ్లాల్సి ఉందని సల్మాన్ లాయర్ కోర్టులో చెప్పారు. దానికి కోర్టు అనుమతి ఉంటేనే వెళ్లాలని మరోసారి తెలిపింది.

ఇరవై ఏళ్ల క్రితం కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ పై కేసు నమోదైంది. అందులో దోషిగా రుజువు కావడంతో రెండు రోజులపాటు జోధ్‌పూర్ జైలులోనే ఆయన గడిపారు. బెయిల్ రాగానే ముంబై చేరుకొని తన సినిమాలతో బిజీ అయిపోయారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు తారలను నిర్దోషులుగా కోరు ప్రకటించింది. 

 

loader