తొలి రోజు క‌లెక్ష‌న్లు కూడా చెప్పుకోదగిన రీతిలో ఏమీ లేవు. ఫైనల్ ఈ చిత్రం  ఫ్లాప్ అని డిసైడ్ చేసింది ట్రేడ్. ఫస్ట్  వీకెండ్ లో అంతా క‌లిపితే 15 కోట్లు కూడా సాధించ‌లేక‌పోయింది. 


తెలుగులో నాని హీరోగా వచ్చి విజయం సాధించిన చిత్రం ‘జెర్సీ’.ఈ  చిత్రం ఆధారంగా షాహిద్ నటించిన హిందీ ‘జెర్సీ’ రూపొందింది. ఈ సినిమాకు కూడా ‘జెర్సీ’ తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడం విశేషం! హిందీ ‘జెర్సీ’ని మన తెలుగు నిర్మాతలయిన అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీతో కలసి అమన్ గిల్ నిర్మించడం మరో విశేషం! మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టించింది. కోవిడ్, ఇత‌ర కార‌ణాల‌తో వాయిదాల మీద వాయిదాలు ప‌డ్డ ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇక సినిమా టాక్ విషయానికి వస్తే రివ్యూ లు, ఆడియన్స్  కూడా ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. కానీ ఈ టాక్‌కు త‌గ్గ‌ట్లుగా క‌లెక్ష‌న్లు  క‌నిపించ‌డం లేదంటోంది ట్రేడ్. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే జెర్సీ  ఎక్సపెక్టేషన్స్ ని  అందుకోలేదు. తొలి రోజు క‌లెక్ష‌న్లు కూడా చెప్పుకోదగిన రీతిలో ఏమీ లేవు. ఫైనల్ ఈ చిత్రం  ఫ్లాప్ అని డిసైడ్ చేసింది ట్రేడ్. ఫస్ట్  వీకెండ్ లో అంతా క‌లిపితే 15 కోట్లు కూడా సాధించ‌లేక‌పోయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా వ‌సూళ్లు 20 కోట్లు దాట‌లేద‌ని బాలీవుడ్ వర్గాల సమచారం. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాపై దాదాపు రూ.90 కోట్ల పెట్టుబ‌డి పెట్టార‌ు. డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ మొత్తం క‌లిపి రూ.40 కోట్ల‌ వరకూ రికవరీ ఉందిట. దాంతో ఈ సినిమాతో నిర్మాత‌ల‌కు స‌గానికి స‌గం.. పోయిన‌ట్టే అని తేలుస్తున్నారు. అన్న‌ట్టు ఈ సినిమాని దిల్ రాజు, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించారు. మ‌రోవైపు.. తెల‌గులో మంచి విజ‌యాన్ని అందుకున్న `హిట్‌` సినిమాని బాలీవుడ్ లో దిల్ రాజునే రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడో పూర్త‌య్యింది. కానీ రిలీజ్ ఎప్పుడో  క్లారిటీ లేదు.

 ఇక జెర్శీ ప్లాఫ్ విషయానికి వస్తే.. స్పోర్ట్స్ డ్రామాలు హిందీ సినిమారంగానికి కొత్తకాదనే విషయం సైతం గుర్తు చేస్తున్నారు. అయితే ‘జెర్సీ’లోని ఫ్యామిలీ డ్రామా కొత్తగా కనిపించే అవకాసం ఉందంటున్నారు. తెలుగు ‘జెర్సీ’లో నాని హీరోగా చేసిన పాత్రలోకి  షాహిద్ సైతం పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేశారు. ఇక తెలుగులో ‘జెర్సీ’ని రూపొందించిన గౌతమ్ తిన్ననూరి, హిందీలోనూ దర్శకత్వం వహించే ఛాన్స్ లభించగానే మరింత బాగా తెరకెక్కించే ప్రయత్నం చేసారని చెప్తున్నారు. అనిత్ మెహతా సినిమాటోగ్రఫి చాలా బాగుందని చెప్తున్నారు. విద్య పాత్రలో మృణాల్ ఠాకూర్ పరిధి మేరకు నటించింది. కరణ్ పాత్రలో రోణిత్ అలరించాడు. అయితే ఏమీ కలిసి రాలేదు.