జయప్రకాష్‌ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ విలక్షణమైన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వెండితెరపై కనిపిస్తే నవ్వులు పూయడమే కాదు, శక్తివంతమైన, రాయలసీమ యాసతో కూడిన నవ్వులు పూయించే డైలాగులు గుర్తొస్తాయి. ఆయన డైలాగ్‌ చెప్పాడంటే కచ్చితంగా అందులో ఓ మ్యాజిక్‌ ఉంటుంది. ఆడియెన్స్ థియేటర్‌లో విశేషంగా ఎంజాయ్‌ చేస్తాడు. 

ఆయన నటించిన సినిమాల్లోని ఆయన చెప్పే డైలాగులు యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అవి మీమ్స్ గా హల్‌చల్‌ చేస్తుంటాయి. ఎవరికైనా పంచ్‌లు వేయాలంటే ఎక్కువగా జయప్రకాష్‌రెడ్డి డైలాగులను వాడుతుండటం విశేషం. ఆయన చెప్పే డైలాగ్‌లు ఎంత పాపులరో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే జయప్రకాష్‌ రెడ్డి చెప్పిన కొన్ని పాపులర్‌ డైలాగ్‌లేంటో ఓ లుక్కేద్దాం. 

పెళ్ళినాడు గుడక మాంసం ఏదిరా.. ఒక్క దినము గుడక ఉండలేవా?

వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉందేమి రా..

మీ మనసులు దెల్చుకున్న్యాం. మా అలవాట్లని మార్చుకున్న్యాం. .

ఏమీ రా నోరు లెచ్చండాదే..

ఆడ ఏం ఉండాయో ఏం లేవో.. కంది బ్యాడలు, శెనగ బ్యాడలు, అన్ని ఒక లారీకి ఏసి పంపిజ్ఞామా..

ఒరేయ్‌ పులీ.. ఏమీరా నెత్తిన అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్‌.. బోడెమ్మ లెక్క..

ఇది నా రాజ్యమే.. ఇక్కడ పగలేగానీ ప్రేమలుండవు.. కళ్లలేగానీ కనికరాలుండవు..

సీమ సందుల్లోకి రారా చూసుకుందాం.. నీ పతాపమో.. నా పతాపమో..

యాందిరా యాంజేస్తన్రా..