Asianet News TeluguAsianet News Telugu

35 కోట్ల ఆఫర్.. నమ్మేటట్లు లేదే

 కొత్త సినిమాలు సైతం ఈ ఓటీటిల్లోకి వచ్చే అవకాసం పరిశీలిస్తున్నారు. చిన్న సినిమాలు అయితే అప్పటిదాకా వడ్డీలు కట్టలేం కాబట్టి వదిలించుకుందాం అని ఓటీటిల్లోకి వదిలేస్తారు. మరి పెద్ద సినిమాల పరిస్దితి ఏమిటి...ఇలా ఆలోచిస్తున్న టైమ్ లో ఓ వార్త ఇండస్ట్రీని, మీడియాని కుదిపేసింది. 

is nani V movie get 35cr offer?
Author
Hyderabad, First Published Apr 12, 2020, 3:39 PM IST


కొన్ని వార్తలు వింటే..ఇలాగే జరిగి ఉంటుందని కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలాగే మరికొన్ని వార్తలు వింటే లేనిపోని డౌట్స్ మొదలవుతాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపధ్యంలో భారతదేశంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో ఇంట్లో ఉండి సమయాన్ని గడపాటానికి చాలా మంది ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లను ఎంచుకుంటున్నారు.  

దాంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్లలో ప్రసారమయ్యే షోలకు, సినిమాలకు ఓ రేంజిలో డిమాండ్ వచ్చేసింది. దీన్ని ఆ సంస్దలు కూడా ఓ రేంజిలో క్యాష్ చేసుకుందామని ఫిక్సై పోయాయి.  అందులో భాగంగా ఫ్యాన్సీ రేట్లు పెట్టి సినిమాలు కొని తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం బేరసారాలు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఈ మీడియంలోకి వచ్చేసాయి. 

అయితే కొత్త సినిమాలు సైతం ఈ ఓటీటిల్లోకి వచ్చే అవకాసం పరిశీలిస్తున్నారు. చిన్న సినిమాలు అయితే అప్పటిదాకా వడ్డీలు కట్టలేం కాబట్టి వదిలించుకుందాం అని ఓటీటిల్లోకి వదిలేస్తారు. మరి పెద్ద సినిమాల పరిస్దితి ఏమిటి...ఇలా ఆలోచిస్తున్న టైమ్ లో ఓ వార్త ఇండస్ట్రీని, మీడియాని కుదిపేసింది. అది ..నాని హీరోగా రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ వి సినిమాని 35 కోట్లకు అమేజాన్ ప్రైమ్ ఆఫర్ చేసిందని. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందో ఇండస్ట్రీకి అర్దం కావటం లేదు. 

ఎందుకంటే నాని స్దాయికి థియోటర్ బిజినెస్ 35 కోట్లు అవటం కష్టం. అలాగే అంత రాబట్టడం కూడా సామాన్యమైన విషయం కాదు. అలాంటిది అమేజాన్ ప్రైమ్ సంస్ద వాడు అంత సొమ్ము పెట్టుబడి పెట్టి ఆ సినిమాని ఏ మాత్రం వెనక్కి డబ్బు వెనక్కి లాగగలుగుతాడు అనేది అందరిముందు ఉన్న పెద్ద ప్రశ్న. దాంతో ఇది రూమర్ అయినా అయి ఉండాలి లేదా...అమేజాన్ ప్రైమ్ వాడు తమ దగ్గర కొత్త సినిమాలు సైతం ఉన్నాయని చెప్పుకునేందుకు ఆ మొత్తం పెట్టడానికి సిద్దపడేనా ఉండాలి. 

అయితే దిల్ రాజు  అమ్మలేందంటున్నారు.  మరీ ముఖ్యంగా థియేట‌ర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుద‌ల చేస్తే త‌మ ఇమేజ్ కి భంగం క‌లుగుతుంద‌ని ఖచ్చితంగా హీరోలు భ‌య‌ప‌డతారు. అందుకే ఎవరురూ ఓటీటీ విడుద‌ల‌కు ఓకే చెప్ప‌డం లేదు. లాక్ డౌన్ మే వ‌ర‌కూ కొన‌సాగితే మాత్రం.. అంద‌రూ ఓటీటీ వైపు దృష్టి సారించాల్సిందే అంటున్నారు. అయితే అప్పుడు ఈ రేటు ఎందుకు పలుకుతుందనేది పెద్ద ప్రశ్న. 
 

Follow Us:
Download App:
  • android
  • ios